ఆ లెనోవో ఫోన్‌కు jio సపోర్ట్ అందింది, పండగ చేస్కోండి

లెనోవో వైబ్ కే5 నోట్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇప్పుడు మీ ఫోన్ రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తుంది. లెనోవో తాజాగా తన వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం VoLTE సపోర్ట్‌ను విడుదల చేసింది.122 ఎంబి సైజులో ఉండే ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను సిస్టం అప్‌డేట్ ద్వారా పొందవచ్చు.

ఆ లెనోవో ఫోన్‌కు jio సపోర్ట్ అందింది, పండగ చేస్కోండి

Read More : పక్కా ప్లాన్‌తో దూసుకొస్తున్న నోకియా ఫోన్స్?

ఈ OTA అప్‌డేట్‌ను పొందాలంటే ఫోన్ Settings > About Phone > System Update.అప్‌డేట్‌ పూర్తి అయిన తరువాత ఫోన్ సాఫ్ట్‌వేర్ వర్షన్ S312కు మారుతుంది. ఈ తాజా అప్‌డేట్‌ను పొందటం ద్వారా వైబ్ కే5 నోట్ యూజర్లు జియో నెట్‌వర్క్ ఆఫర్ చేస్తున్న VoLTE కాల్స్‌ను పూర్తి నాణ్యతతో ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు వేరియంట్‌లలో..

భారీ అంచనాల మధ్య లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో కొద్ది నెలల క్రితం విడుదలయ్యింది. ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.13,499. బ్లాక్, సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోన్న ఈ ఫోన్‌లను ప్రముఖ ఈ-కామర్స్ సైట్ Flipkart విక్రయిస్తోంది.

హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే

లెనోవో వైబ్ కే5 నోట్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 450 nits బ్రైట్నెస్, 1000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్లను ఈ డిస్‌ప్లేలో పొందుపరిచారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆక్టా కోర్ ప్రాసెసర్

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం..

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. సెక్యూర్ జోన్ పేరుతో ఈ డివైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫీచర్ ఫోన్‌లోని సమాచారాన్ని భద్రంగా దాస్తుంది. రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్‌లను ఈ ఫోన్‌లో నిర్వహించుకునేు అవకాశం కల్పించారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా నాణ్యత...

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, పీడీఏఎఫ్, f/2.2 aperture వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంగా ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫింగర్ ప్రింట్ స్కానర్‌

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌‍‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసారు. 0.3 సెకన్ల వ్యవధిలో ఈ సెన్సార్, ఫోన్‌ను అన్‌లాక్ చేయగలదు. థియేటర్ మాక్స్ టెక్నాలజీ ఫోన్ సౌండ్ క్వాలిటీని రెట్టింపు చేస్తుంది.

ANTVR హెడ్‌సెట్‌

వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌‌తో పాటు అందిస్తోన్న లాంచ్ ఆఫర్స్‌లో భాగంగా రూ.999కే థియేటర్ మాక్స్ కంట్రోలర్‌తో పాటు ANTVR హెడ్‌సెట్‌ను లెనోవో ఆఫర్ చేస్తుంది. Amkette Evo Gamepad Pro 2తో పాటు ANTVR హెడ్‌సెట్‌ను కేవలం రూ.1,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Vibe K5 Note receives OTA update for VoLTE support. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting