వడ్డీలేని నెలవారి చెల్లింపుల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

Posted By:

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ దేశవాళీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, కార్బన్‌ల నుంచి తీవ్రమైన పోటిని ఎదుర్కొంటోంది. ఈ పోటీకి గల ప్రధాన కారణాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇండియాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు సామ్‌సంగ్‌కు, యాపిల్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది.

ఈ నేపధ్యంలో సామ్‌సంగ్ తన విక్రయాల సంఖ్యను మరింత పెంచుకునేందుకు 15శాతం క్యాష్ బ్యాక్ ఇంకా వడ్దీ రహిత ఈఎమ్ఐ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. సామ్‌సంగ్ తాజా స్కీమ్‌లో భాగంగా ఎంపిక చేయబడిన గెలాక్సీ డివైజ్‌‌లను ఏ విధమైన డౌన్‌పేమెంట్ చెల్లించకుండా సొంతం చేసుకోవచ్చు. ఫోన్ ధర మొత్తాన్ని కొంచెం కొంచెం‌గా 12 నెలల పాటు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఈఎమ్ఐ స్కీమ్ ద్వారా మీరు గెలాక్సీ ఎస్4ను కొనుగోలు చేసినట్లయితే నెలకు 3,459 చొప్పున 12 నెలల పాటు చెల్లిస్తే సరిపోతుంది. మార్కెట్లో గెలాక్సీ ఎస్4 ధర రూ.41,500.

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ డివైజ్‌ల వివరాలు:

గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్, గెలాక్సీ ఎస్2, గెలాక్సీ వై, గెలాక్సీ ఏస్, గెలాక్సీ కెమెరా, గెలాక్సీ నోట్ 800, గెలాక్సీ గ్రాండ్. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్ఎస్‌బీసీ ఇంకా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఈఎమ్ఐ ఆఫర్‌ను పొందవచ్చు. ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న సామ్‍సంగ్ గెలాక్సీ డివైజ్‌ల ధర వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వడ్డీలేని నెలవారి చెల్లింపుల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

1.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

ధర రూ.41,500,
ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా నెలవరీ చెల్లించాల్సి మొత్తం: 3,459.

వడ్డీలేని నెలవారి చెల్లింపుల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

2.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 510 (Samsung Galaxy Note 510):
అసలు ధర రూ.30,900,
ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా చెల్లించాల్సిన మొత్తం: రూ.2,575.

వడ్డీలేని నెలవారి చెల్లింపుల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

3.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2(Samsung Galaxy Note 2):
అసలు ధర రూ.37,380,
ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా నెలవారీ చెల్లించాల్సిన మొత్తం రూ.3,115.

వడ్డీలేని నెలవారి చెల్లింపుల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

4.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800 (Samsung Galaxy Note 800):
అసలు ధర రూ.35,190,
ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా నెలవారీ చెల్లించాల్సిన మొత్తం ర.2,933.

వడ్డీలేని నెలవారి చెల్లింపుల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

5.) సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ (Samsung Galaxy Grand Duos):
ఫోన్ ధర రూ.21,500.
ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా నెలవారీ చెల్లించాల్సిన మొత్తం రూ.1,792.

వడ్డీలేని నెలవారి చెల్లింపుల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

6. సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 310 (Samsung Galaxy Tab 2 310):
ట్యాబ్లెట్ ధర రూ.16,499,
ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా నెలవారీ చెల్లించాల్సిన మొత్తం రూ.1375.

వడ్డీలేని నెలవారి చెల్లింపుల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

7.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌3(Samsung Galaxy S3):
ఫోన్ దర రూ.30,950.
ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా నెలవారీ చెల్లించాల్సిన మొత్తం రూ.2,579.

వడ్డీలేని నెలవారి చెల్లింపుల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

8.) సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా (Samsung Galaxy camera):
కెమెరా ధర రూ. 26,520,
ఈఎమ్ఐ స్కీమ్‌లో భాగంగా నెలవారీ చెల్లించాల్సిన మొత్తం రూ.2,210.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot