Home
Mobile

రూ.15 వేల ధరలో లేటెస్ట్‌ ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. అయితే ఈ 5 ఫోన్‌లు మీకోసమే..!

భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం బడ్జెట్‌ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇందులో వివో, రియల్‌మి, ఐకూ, రెడ్‌మి ఫోన్‌లు సహా అనేక బ్రాండ్‌లకు చెందిన మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌లు (5G Smartphones Under Rs15000 Price) రూ.15 వేల ధరలో అందుబాటులోకి వచ్చినా.. అనేక ప్రత్యేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కలిగి ఉన్నాయి.

రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Redmi 15c 5G Smartphone) ప్రారంభ ధర రూ.12499 గా ఉంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల HD+ (720 x 1600 పిక్సల్స్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

latest top 5g smartphones under Rs15000 price range here is the list  specifications

ఈ ఫోన్ 33W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా రెడ్‌మి వెనుక వైపు 50MP AI కెమెరా, మరో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది.

వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ (Vivo T4x 5G Smartphone) ప్రస్తుతం బ్యాంకు ఆఫర్లతో రూ.14999 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే, 44W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది.

latest top 5g smartphones under Rs15000 price range here is the list  specifications

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS పైన పనిచేస్తోంది. 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్‌ లెన్స్‌, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.12499 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810 H సర్టిఫికేషన్‌తో 360 డిగ్రీల ఆర్మర్‌ బాడీ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ ఫోన్ (Oppo K13x 5G Smartphone) 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్‌, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

latest top 5g smartphones under Rs15000 price range here is the list  specifications

శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ (Samsung Galaxy M17 5G Smartphone) ప్రారంభ ధర రూ.13999 గా ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ Exynos 1330 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ (OIS), 5MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో, 13MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

latest top 5g smartphones under Rs15000 price range here is the list  specifications

పోకో M7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ (Poco M7 Plus 5G Smartphone) ప్రారంభ ధర రూ.12499 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ 18W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
latest top 5g smartphones under Rs15000 price range here is the list, specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X