ఇండియాలో మరిన్ని నోకియా స్మార్ట్ ఫోన్స్

Posted By: Staff

ఇండియాలో మరిన్ని నోకియా స్మార్ట్ ఫోన్స్

నోకియా త్వరలో ఇండియాలో నాలుగు స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయనుందని సమాచారం. నోకియా విడుదల చేయనున్నటువంటి ఈ స్మార్ట్ పోన్స్ 1 GHz ప్రాససెర్‌ని కలిగి ఉంటాయని తెలిపారు. నోకియా ఇలా ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడానికి కారణం కొల్పోయినటువంటి పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో నోకియా, మైక్రోసాప్ట్‌తో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పోన్స్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రాబోయ కాలంలో సింబియన్ ఆపరేటింగి సిస్టమ్ మొబైల్ ఫోన్స్ ఇక కనుమరుగు అవనున్నాయని అందరు భావించారు. ఐతే దీనికి భిన్నంగా నోకియా సింబియమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌ని అప్ గ్రేడ్ చేసి కొన్ని కొత్త ఫీచర్స్‌తో నాలుగు స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది.

నోకియా తమయొక్క కస్టమర్స్‌కి అందించనున్న నాలుగు స్మార్ట్ ఫోన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Nokia 701 – Helen
Nokia 700 – Zeta
Nokia 600 – Cindy
Nokia 500 – Fate

నోకియా హెలెన్, జీటా రెండు మొబైల్స్ కూడా 1 GHz ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. సింబియన్ కొత్తగా వర్సన్ పేరు బెల్లీ. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Ovi బ్రౌజర్ 8.1వర్సన్‌ని సపోర్టు చేస్తుంది. Ovi బ్రౌజర్‌తో నోకియా హెలెన్, జీటాలలో ఇంటర్నెట్ చాలా స్పీడ్‌గా, ఫాస్ట్‌గా ఎంజాయ్ చేయవచ్చు. ఇక నోకియా 600(సిండీ), నోకియా 500(ఫేట్) విషయానికి వస్తే ఈ రెండు కూడా సింబియన్ అన్నా ఆపరేటింగి సిస్టమ్‌తో రన్ అవుతాయి. కొన్ని రోజలు క్రితం నోకియా నుండి s40 అనే స్మార్ట్ ఫోన్ బయటకు విడుదలవుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం నోకియా త్వరలో విడుదలవుతున్నటువంటి నాలుగు స్మార్ట్ ఫోన్స్ మీద దృష్టి పెట్టింది. అంతేకాకుండా సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా కొంచెం దృష్టిని కొనసాగించినట్లు సమాచారం. సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌కు లెటేస్ట్ వర్సన్ బెల్లీ. దీనితో పాటు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌ని ఫిబ్రవరి 2011కల్లా విడుదల చేయాలని గతంలో నోకియా సిఈవో స్టీఫెన్ ఎలాప్ తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting