రూ.3,333కే లావా 4G VoLTE ఫోన్

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా (Lava) సరికొత్త 4G VoLTE ఫీచర్ ఫోన్‌ను సోమవారం మార్కెట్లో లాంచ్ చేసింది. లావా 4జీ కనెక్ట్ ఎమ్1 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.3,333. మార్కెట్లో లాంచ్ అయిన మొట్టమొదటి 4జీ వోల్డ్ స్మార్ట్ ఫీచర్ ఫోన్ ఇదే కావటం విశేషం. ఈ ఫోన్‌లను మరికొద్ది వారాల్లో అన్ని రిటైల్ మార్కెట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు లావా తెలిపింది.

రూ.3,333కే లావా  4G VoLTE ఫోన్

లావా 4జీ కనెక్ట్ ఎమ్1 స్పెసిఫికేషన్స్

Redmi రికార్డులు బ్రేక్ చేస్తుందా?, టార్గెట్ 70 లక్షల Note 4 ఫోన్‌లు

1.2GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1750mAh బ్యాటరీ, వీజీఏ కెమెరా, 4జీ VoLTE వాయిస్ కాలింగ్‌తో పాటు 2జీ వాయిస్ కాలింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. పాలీకార్బోనేట్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్ స్మార్ట్‌ఫోన్ స్ధాయి ప్రత్యేకతలను కలిగి డీసెంట్ బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తుంది. Facebook Lite వంటి మెసేజింగ్ యాప్స్‌ను ఈ ఫోన్‌లో ముందస్తుగా లోడ్ చేసారు. వాస్తవానికి భారతదేశపు మొట్టమొదటి 4G VoLTE ఫీచర్ ఫోన్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేస్తుందని అంతా భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లావా తొలి 4G VoLTE ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఈ ఫోన్‌ల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది

English summary
Lava 4G Connect M1 Feature Phone With Reliance Jio Support Launched in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot