రూ.999కే Lava స్మార్ట్‌ఫోన్

మిడ్ రేంజ్ స్పెసిఫికేషన్‌లతో లావా కంపెనీ నుంచి కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన Lava A51, ఇప్పుడు భారీ తగ్గింపుతో మార్కెట్లో ట్రేడ్ అవుతోంది.

రూ.999కే Lava స్మార్ట్‌ఫోన్

రూ.4,199 ఖరీదుగల ఈ స్మార్ట్‌ఫోన్‌ను vobizenmobiles.com కేవలం రూ.999కే విక్రయిస్తోంది. Unikoid Electronics Ltdకు చెందిన Vobizen Mobiles ఇటీవల రూ.499 ధర ట్యాగ్‌లో Vobizen Wise 5 స్మార్ట్ ఫోన్ ను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lava A51 స్పెసిఫికేషన్స్...

4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్800x 480పిక్సల్స్, 207 పీపీఐ రిసల్యూషన్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.2GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్‌ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 1750 mAh బ్యాటరీ.

కోయంబత్తూరుకు చెందిన ..

కోయంబత్తూరుకు చెందిన వోబిజెన్ మొబైల్స్ అనే కంపెనీ Vobizen Wise 5 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేసింది. ధర రూ.499. యునికోయిడ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే ఆన్‌లైన్ సెల్లర్ ద్వారా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నట్లు సంస్థ వెబ్‌సైట్ చెబుతోంది. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ.3,499 అట. ప్రత్యేక డిస్కౌంట్ పై రూ.499 ధర ట్యాగ్‌తో విక్రయిస్తున్నట్లు సంస్థ చెబుతోంది.

22 నుంచి 28 రోజుల్లో ఫోన్ డెలివరీ

ఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వారికి 22 నుంచి 28 రోజుల్లో ఫోన్ డెలివరీ ఉంటుందని Vobizen వెబ్ సైట్ చెబుతోంది. గ్రే, ఎల్లో ఇంకా వైట్ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉండే Vobizen Wise 5 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

Vobizen Wise 5 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్854x 480పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ 2.0 పోర్ట్, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ప్రాక్సిమిటీ సెన్సార్).

ముఖ్యమైన సూచన..

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను బుక్ చేసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఈ ఫోన్ ఆన్‌లైన్ ఛానల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో లేదు. ఈ వైబ్‌సైట్‌లో బుక్ చేసే ఫోన్ పై పూర్తి బాధ్యత మీదే. ఒకవేళు ఇప్పటికే మీరు Vobizen Wise 5 పొందినట్లయితే ఆ ఎక్స్‌పీరియన్స్‌ను మాతో షేర్ చేసుకోగలదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lava A51 smartphone retailing at just Rs 999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot