Home
Mobile

వెనుకవైపు స్క్రీన్‌, ఐఫోన్‌ తరహా యాక్షన్‌ కీ, 6.78 అంగుళాల డిస్‌ప్లే 5G ఫోన్‌ సేల్‌.. ధర రూ.2000 డిస్కౌంట్‌..!

లావా నుంచి ఇటీవల లావా అగ్ని 3 స్మార్ట్‌ ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌ సెట్‌ అదిరిపోయే రెండు ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఐఫోన్‌ తరహా యాక్షన్‌ కీ, వెనుకవైపు కెమెరా మాడ్యూల్‌ వద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. మరియు అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం (Lava Agni 3 5G Smartphone Sale) అయింది. లావా వెబ్‌సైట్‌ మరియు అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. అయితే ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే ఛార్జర్‌తో రూ.22,999 కు సొంతం చేసుకోవచ్చు. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

LAVA Agni 3 5G Smartphone sale

అయితే ప్రారంభ ధరలో భాగంగా (Lava Agni 3 5G Smartphone Sale introductory Offer) రూ.2000 తగ్గింపును (With Charger) పొందవచ్చు. Without ఛార్జర్‌ వేరియంట్‌పై రూ.1000 డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ సేల్‌ లో భాగంగా అమెజాన్‌ ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా గరిష్ఠంగా రూ1150 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుకవైపు కెమెరా మాడ్యుల్‌ వద్ద 1.74 అంగుళాల అమోలెడ్ సెకండరీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ కర్వడ్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది.

3 OS అప్‌డేట్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ తో జతచేయబడింది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS తో పనిచేస్తుంది. 3 సంవత్సరాలపాటు అండ్రాయిడ్‌ అప్‌డేట్‌లను పొందవచ్చు. 128GB, 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి ఉంది.

50MP+ 8MP +8MP + 16MP కెమెరాలు :
ఈ లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్ క్వాడ్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 3x జూమింగ్‌ సామర్థ్యంతో 8MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియోల కోసం 16MP కెమెరాను అమర్చారు.

66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, యాక్షన్‌ కీ ఫీచర్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీలను కలిగి ఉంది. ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ యాక్షన్‌ కీ ని కలిగి ఉంది. పవర్‌ బటన్‌ వద్ద ఈ కీ ని గుర్తించవచ్చు. సింగిల్‌ క్లిక్‌, డబుల్‌ క్లిక్‌, లాంగ్‌ ప్రెస్‌ వంటి గెశ్చర్‌లను కలిగి ఉంటుంది. వెనుకవైపున్న స్క్రీన్‌ ద్వారా స్టాప్‌ వాచ్‌గా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ముఖ్యమైన నోటిఫికేషన్‌ల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
LAVA Agni 3 5G Smartphone sale is live on amazon specs features and price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X