Home
Mobile

2 డిస్‌ప్లేలు, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50MP కెమెరా, 6.78 అంగుళాల 3D కర్వడ్ డిస్‌ప్లే ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్

లావా సంస్థ గత సంవత్సరం లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక వైపు కూడా చిన్న సైజు డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఐఫోన్ తరహాలో యాక్షన్‌ కీ తోపాటు 50MP కెమెరా, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.3000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ధర, సేల్‌ వివరాలు :
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌ (Lava Agni 3 Smartphone Amazon Offer) అమెజాన్‌లో 8GB ర్యామ్ + 128GB స్చోరేజీ ధర రూ.20,998 గా (Without Charger)ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24998 గా (With Charger) ఉంది. అమెజాన్‌లో కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Lava agni 3 5G Smartphone

డిస్‌ప్లే వివరాలు :
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్‌ 1.5K ప్రైమరీ డిస్‌ప్లే, 1.74 అంగుళాల అమోలెడ్‌ ఇన్‌స్టా డిస్‌ప్లేను (కెమెరా మాడ్యూల్‌ వద్ద) కలిగి ఉంది. ఈ ప్రైమరీ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇన్‌స్టా డిస్‌ప్లేను నోటిఫికేషన్‌లు సహా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ వేపర్ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ లావా ఫోన్‌ బెస్ట్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS, EIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MPగ టెలిఫోటో కెమెరా, 2x పొర్ట్రెయిట్‌ జూమ్‌తో 8 అల్ట్రావైడ్‌ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

5000mAh బ్యాటరీ :
లావా హ్యాండ్‌సెట్‌ 66W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ హితర్‌ గ్లాస్‌ మరియు ప్రిస్టిన్‌ గ్లాస్‌ వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఐఫోన్ తరహాలో యాక్షన్‌ కీ ని కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G, WiFi 6E, బ్లూటూత్‌ 5.4, GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

Best Mobiles in India

English summary
Lava agni 3 5G Smartphone with dual display gets rs3000 coupon discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X