స్టైలిష్ డిజైన్, రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరా, 66W ఫాస్ట్ ఛార్జింగ్ 5G ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా నుంచి గత సంవత్సరం లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ రెండు డిస్‌ప్లేలను కలిగి ఉంది. అంటే వెనుక వైపు కూడా ఇన్‌స్టా డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 50MP కెమెరాను అమర్చి ఉంది. ఐఫోన్ తరహాలో యాక్షన్ కీ ను కలిగి ఉంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లు పూర్తి వివరాలు.
స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
భారత్ మార్కెట్ లో లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ (Lava Agni 3 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్చోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధరలు రూ.22999, రూ.24999 గా ఉంది.

రూ.3000 డిస్కౌంట్ :
అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌పై ప్రస్తుతం కూపన్ డిస్కౌంట్ ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందే అవకాశం ఉంది. ప్రిస్టిన్ గ్లాస్, హితర్ గ్లాస్ వంటి రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
లావా స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్ 1.5K ప్రైమరీ డిస్‌ప్లే, 1.74 అంగుళాల అమోలెడ్ ఇన్‌స్టా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఇన్‌స్టా డిస్‌ప్లే వెనుక కెమెరా మాడ్యూల్ వద్ద ఉంటుంది. ఈ ఇన్‌స్టా స్క్రీన్‌ను నోటిఫికేషన్‌లు సహా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.

3 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. LPDDR5 8GB ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను అందిస్తామని లావా తెలిపింది.
50MP కెమెరా :
ఈ ఫోన్ నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను అమర్చి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంది. మరియు 8MP అల్ట్రావైడ్, 3x జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరాను అమర్చారు. మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
యాక్షన్ కీ :
ఈ హ్యాండ్‌సెట్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే ఛార్జర్ లేకుండా ఒక ధర, ఛార్జర్‌తో కలిపి మరో ధరకు అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు ఐఫోన్ తరహాలో ఈ హ్యాండ్‌సెట్ యాక్షన్ కీ ని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G (14 బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుంది), 4G, బ్లూటూత్ 5.4, వైఫై 6E, GPS ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








