లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ వివరాలు వెల్లడి.. ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Lava Agni 4 5G Smartphone : లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో నవంబర్ 20 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. డిజైన్ సహా క్రమంగా వివరాలను వెల్లడిస్తోంది. గత సంవత్సరం లావా అగ్ని 3 5G ఫోన్ విడుదల చేయగా.. ఈ సంవత్సరం అగ్ని 4 విడుదల కానుంది. ఈ ఫోన్ పిల్ ఆకారంలో కెమెరా మాడ్యుల్ ను కలిగి ఉంటుంది. అయితే తాజాగా ఈ ఫోన్ ప్రాసెసర్ వివరాలు వెల్లడయ్యాయి.
ఈ చిప్‌సెట్ తోనే :
లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ వివరాలను లావా తన X హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. దీని ఆధారంగా ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ LPDDR5x ర్యామ్, UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది.

ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లోనే :
సాధారణంగా ర్యామ్, స్టోరేజీ సామర్థ్యం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలోనే ఎక్కువగా గమనిస్తుంటాం. దీని ఆధారంగా అగ్ని 4 5G ఫోన్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ పిల్ ఆకారంలో కెమెరా మాడ్యుల్ ఉంటుంది. రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. డ్యూయల్ LED ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది.
ఫుల్ HD+ డిస్‌ప్లే :
లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక వైపు ఉన్న ప్యానల్ వద్ద AGNI బ్రాండింగ్‌ను గుర్తించవచ్చు. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే ఛార్జింగ్ వివరాలు వెల్లడి కానున్నాయి.
అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ ఏ ధర సెగ్మెంట్లో లాంచ్ కానుందనే వివరాలను లావా వెల్లడించలేదు. అయితే టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ రూ.30,000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఈ ఫోన్ విడుదల అనంతరం లావా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. విడుదల సమయంలో సేల్ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఫాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ వంటి కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది.
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 3D 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక వైపు ఇన్‌స్టా డిస్‌ప్లే కూడా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS తో పనిచేస్తోంది.
ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్, 2x పొర్ట్రెయిట్ జూమ్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా OIS, EIS సపోర్టును కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








