మీడియాటెక్ ప్రాసెసర్, రెండు కెమెరాలు, డ్యూయల్ ఫ్లాష్, 7000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్..!
లావా నుంచి అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇటీవలే ఈ ఫోన్ టీజర్‌ను షేర్ చేసిన సంస్థ, తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ ఫోన్ పిల్ ఆకారంలో డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. గత సంవత్సరం విడుదల అయిన లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ రెండు డిస్‌ప్లేలను కలిగి ఉంది. అయితే త్వరలో విడుదల కానున్న అగ్ని 4 5G హ్యాండ్‌సెట్ మాత్రం ఒకే డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ఎప్పుడు విడుదల కానుంది :
భారత్ మార్కెట్‌లో లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ (Lava Agni 4 5G Smartphone) నవంబర్ 20 వ తేదీన విడుదల కానుంది. సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా లావా ఈ వివరాలను వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ మిడ్ రేంజ్ ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. పిల్ ఆకారంలో వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్ ఫ్లాష్ లైట్‌లతో అందుబాటులోకి రానుంది.
7000mAh భారీ బ్యాటరీ! :
ఈ హ్యాండ్‌సెట్ ఇటీవలే IECEE సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ అయింది. LBP1071A మోడల్ నంబర్ పేరుతో కనిపించింది. ఈ లిస్టింగ్ ఆధారంగా లావా ఫోన్ 7000mAh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
అంచనా వివరాలు :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. OS వివరాలు సహా స్టోరేజీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మిడ్ రేంజ్ ధరలో! :
లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ రూ.25 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ ను లావా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ :
గత సంవత్సరం విడుదలైన లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 3D 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, వెనుక వైపు ఇన్‌స్టా డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS తో పనిచేస్తోంది. 3 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ OIS, EIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్ మరియు 2x పొర్ట్రెయిట్ జూమ్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








