Home
Mobile

50MP + 50MP (సెల్ఫీ) కెమెరాలు, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్, 1.5K డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల

లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ (Lava Agni 4 5G Smartphone) భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్‌ మెటల్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. మీడియాటెక్‌ ప్రాసెసర్‌, అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. గత సంవత్సరం లాంచ్‌ అయిన అగ్ని 3 5G ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా ఈ ఫోన్‌ విడుదల అయింది. అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5K ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2400 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 446 ppi పిక్సెల్‌ డెన్సిటీని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

lava agni 4 5G smartphone launched with MediaTek dimensity 8350 Chip  Vayu ai in india

ఈ ఫోన్‌ అల్యూమినియం మెటల్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. వెనుక వైపు AG గ్లాస్‌ తో అందుబాటులోకి వచ్చింది. అగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌ సూపర్‌ యాంటీ డ్రాప్‌ డైమండ్‌ ఫ్రేమ్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఫలితంగా పొరపాటున కింద పడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌ 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP + 8MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంది. 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ కూడా ఉంది. ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (EIS) సపోర్టుతో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. రెండు వైపుల ఉన్న కెమెరాలతో 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

lava agni 4 5G smartphone launched with MediaTek dimensity 8350 Chip  Vayu ai in india

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఈ ఫోన్‌ Vayu AI ను పరిచయం చేసింది. వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా ఫోన్‌ను నియంత్రించవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు AI Math Teacher, AI English Teacher, AI Text Assistant, AI Call Summery, ఏఐ ఫోటో ఎడిటర్‌, ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌, AI Horoscope వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సర్కిల్ టూ సెర్చ్‌ ఫీచర్‌ కూడా ఉంది.

యాక్షన్‌ కీ :
ఈ హ్యాండ్‌సెట్ ద్వారా తొలిసారిగా లావా యాక్షన్‌ కీ (Action Key) ను ప్రవేశపెట్టింది. కెమెరా, సహా అనేక యాప్స్‌ను సులభంగా వినియోగించుకొనేందుకు ఈ కీ సాయం చేస్తుంది. 4300 sq mm VC లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

19 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ :
లావా ఫోన్ 66W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఛార్జర్ ద్వారా కేవలం 19 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ ను పూర్తి చేయవచ్చని లావా చెబుతోంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, యాప్ లాక్‌, ఫేస్‌ అన్‌లాక్‌, యాంటీ థెప్ట్‌ అలారం వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.4, USB-C, IR బ్లాస్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ లూనార్‌ మిస్ట్‌, ఫాంటమ్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

లావా అగ్ని 4 5G ధర, సేల్‌ వివరాలు :
లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను లావా ప్రకటించింది. ఈ ఫోన్ సేల్‌ నవంబర్‌ 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వారంటీ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
lava agni 4 5G smartphone launched with MediaTek dimensity 8350 Chip, Vayu ai in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X