ఫ్లాట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, డ్యూయల్ కెమెరాలతో 5G స్మార్ట్‌ఫోన్!.. పూర్తి వివరాలు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇటీవల వచ్చిన లీక్స్ ఆధారంగా వచ్చే నెలలో ఈ లావా హ్యాండ్‌సెట్ విడుదల కానుందని తెలుస్తోంది. లావా అగ్ని 4 5G పేరుతో (Lava Agni 4 5G Smartphone) ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లావా కొత్త ఫోన్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ అయింది. దీని ఆధారంగా త్వరలోనే ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ కానుందని తెలుస్తోంది.
అయితే లావా సంస్థ మాత్రం ఇప్పటి వరకు లాంచ్ వివరాలను వెల్లడించలేదు. ఇటీవలే టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ తెలిపిన వివరాల ఆధారంగా లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ నవంబర్ నెలలో అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ సమాంతర (Horizontal) కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది.

భారీ బ్యాటరీతో! :
లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 7000mAh కంటే భారీ బ్యాటరీతో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
డ్యూయల్ కెమెరా! :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. మరో కెమెరా సహా సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.
లావా సంస్థ ఇప్పటి వరకు విడుదల తేదీ వివరాలను వెల్లడించలేదు. లావా అగ్ని 3 ఫోన్ ప్రధాన డిస్‌ప్లేతోపాటు ఇన్‌స్టా డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. అగ్ని 4 ఫోన్ సింగిల్ డిస్‌ప్లేనే కలిగి ఉంటుంది. అగ్ని 4 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ తో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల 3D 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, వెనుక వైపు 1.74 అంగుళాల అమోలెడ్ ఇన్‌స్టా డిస్‌ప్లేలను కలిగి ఉంది. ఈ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్, 2x పొర్ట్రెయిట్ జూమ్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పై పనిచేస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20999 గా ఉంది.


Click it and Unblock the Notifications








