7000mAh భారీ బ్యాటరీతో 5G ఫోన్.. తాజాగా కెమెరా డిజైన్ విడుదల..!
లావా నుంచి భారత్ మార్కెట్‌లో ఈ నెలలోనే లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇటీవలే అనేక లీక్స్ వచ్చాయి. తాజాగా లావా సంస్థ ఈ ఫోన్‌ను టీజర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఈ ఫోన్ కెమెరా డిజైన్ సహా వివరాలు వెల్లడయ్యాయి. గత సంవత్సరం లాంచ్ అయిన లావా అగ్ని 3 5G ఫోన్ డ్యూయల్ డిస్‌ప్లేలను కలిగి ఉండగా.. అగ్ని 4 మాత్రం ఒకే డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. ఈ లావా హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
కెమెరా డిజైన్ షేర్ చేసిన లావా :
లావా తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ వెనుక వైపు పిల్ ఆకారంలో డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్ LED ఫ్లాష్ ను కూడా కలిగి ఉంటుంది. అక్కడే AGNI బ్రాండింగ్‌ను కూడా గుర్తించవచ్చు.

భారీ బ్యాటరీతో :
లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ (Lava Agni 4 5G Smartphone) ఇటీవలే IECEE సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో LBP1071A మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ లిస్టింగ్ ఆధారంగా ఈ హ్యండ్‌సెట్ 7000mAh లిథియం పాలిమర్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఫుల్ HD+ డిస్‌ప్లే :
ఈ లావా స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే డిస్‌ప్లే బ్రైట్‌నెస్, ప్రొటెక్షన్ సహా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ ను కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఫోన్ UFS 4.0 తో పనిచేసే అవకాశం ఉంది.
రూ.25 వేల ధర సెగ్మెంట్‌లో :
ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో రూ.25 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ లాంచ్ తేదీ సహా అనేక వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Precision in Symmetry🔥🔥🔥🔥#Agni4 #ComingSoon #LavaMobiles pic.twitter.com/FWGUXn0Y9N
— Lava Mobiles (@LavaMobile) November 1, 2025
అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ :
గత సంవత్సరం లాంచ్ అయిన అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 3D 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు ఇన్‌స్టా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లేతో కాల్, మెసేజ్ , అలారం, వాతావరణ సమాచారం వంటి నోటోఫికేషన్‌లను పొందవచ్చు.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని జతచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వేపర్ కూలింగ్ ఛాంబర్ కలిగిఉంది. దీంతోపాటు యాక్షన్ బటన్‌ను కూడా కలిగి ఉంది. ఈ బటన్ ద్వారా యాప్‌లు త్వరగా ఓపెన్ చేసేందుకు, స్క్రీన్ షాట్ తీసేందుకు, ఫ్లాష్ లైట్ సహా మరిన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు.
ఈ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా OIS, EIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్, 2x పొర్ట్రెయిట్ జూమ్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








