Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేతో లావా అగ్ని 4 5G ఫోన్‌.. రూ.2000 డిస్కౌంట్‌తో ఇవాళ్టి నుంచే సేల్‌

Lava Agni 4 5G Smartphone Sale : భారత్‌ మార్కెట్లో లావా సంస్థ ఇటీవల అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో వచ్చింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ సేల్‌ ఇవాళ (నవంబర్‌ 25, 12PM) మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. లూనార్‌ మిస్ట్‌, ఫాంటమ్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

లావా అగ్ని 4 5G సేల్‌ :
ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీలోనే అందుబాటులోకి వచ్చింది. దీని ధర ధర రూ.24,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే సేల్ తొలిరోజు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని అమెజాన్ ద్వారా తెలుస్తోంది.

Lava Agni 4 5G smartphone sale

లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ అల్యూమినియం మెటల్‌ ఫ్రేమ్‌, వెనుక వైపు AG గ్లాస్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు యాంటీ డ్రాప్‌ డైమండ్‌ ఫ్రేమ్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఫలితంగా కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 2400 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు వెట్‌ టచ్‌ ఫీచర్‌ కలిగి ఉంటుంది. అంటే తడి చేతులతోనూ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని లావా హామీ ఇచ్చింది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్ 66W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 19 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చని లావా తెలిపింది. ఈ ఫోన్‌ యాక్షన్ కీ ని కలిగి ఉంది. దీంతోపాటు Vayu AI ను కూడా కలిగి ఉంది.

ఈ ఫోన్‌ సర్కిల్‌ టు సెర్చ్‌ సహా ఏఐ ఫోటో ఎడిటర్‌, ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌, AI Horoscope, AI Math Teacher, AI English Teacher, AI Text Assistant, AI Call Summery ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం యాంటీ థెఫ్ట్‌ అలారం, యాప్‌ లాక్‌, ఫేస్‌ అన్‌లాక్‌, ఫింగర్‌ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.

ఈ ఫోన్ 4300 sq mm VC లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. IP64 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, WiFi, బ్లూటూత్‌ 5.4, USB-C, IR బ్లాస్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Agni 4 5G smartphone sale to start from today with Rs2000 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X