Home
Mobile

7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో 5G ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, విడుదల వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా ఇటీవల కాలంలో అనేక మోడల్స్‌ ను లాంచ్‌ చేసింది. ఎంట్రీ, బడ్జెట్ ధరలో ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ కానుంది. లావా అగ్ని 4 పేరుతో (Lava Agni 4 Smartphone) ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల కానుందని తెలుస్తోంది. గత సంవత్సరం లాంచ్ ‌అయిన లావా అగ్ని 3 హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా ఈ ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది.

గత సంవత్సరం విడుదల అయిన లావా అగ్ని 3 ఫోన్‌ రెండు డిస్‌ప్లేలతో (ప్రధాన, ఇన్‌స్టా డిస్‌ప్లే) ఆకట్టుకుంది. దీంతోపాటు అనేక ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. అయితే లావా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్ సుధన్షు అంబోర్‌ ఈ వివరాలను అంచనా వేశారు.

lava agni 4 smartphone launch timeline

ఎప్పుడు విడుదల కానుంది? :
టిప్‌స్టర్ అందించిన వివరాల ఆధారంగా లావా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం నవంబర్‌ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు. అయితే ఇటీవల వచ్చిన కొన్ని నివేదికల ఆధారంగా ఈ లావా హ్యాండ్‌సెట్ అనేక అంచనా వివరాలు వెల్లడయ్యాయి.

అంచనా వివరాలు :
టిప్‌స్టర్‌ వివరాల ఆధారంగా లావా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ HD+ ఫ్లాట్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్‌ మెటల్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 7000mAh కంటే పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ కెమెరా మాడ్యూల్‌ డిజైన్‌ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. మరియు వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 50MP కెమెరా సహా మరో కెమెరా ఉంటుంది. అయితే సెల్ఫీ కెమెరాలు వెల్లడి కాలేదు. మీడియాటెక్‌ డైమెన్సిటి 8350 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

లావా అగ్ని 4 లాంచ్‌ టైమ్‌లైన్‌ సహా స్పెసిఫికేషన్‌ల వివరాలపై సంస్థ ఎటువంటి స్పందన తెలియజేయలేదు. త్వరలో అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్ రెండు డిస్‌ప్లేలు, యాక్షన్‌ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది.

* లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 3D 1.5K కర్వడ్ అమోలెడ్‌ డిస్‌ప్లే, వెనుక వైపు 1.74 అంగుళాల అమోలెడ్‌ ఇన్‌స్టా డిస్‌ప్లేలను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పై పనిచేస్తోంది.

ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS, EIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరా, 2x పొర్ట్రెయిట్‌ జూమ్‌తో 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 66W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
lava agni 4 smartphone launch timeline and specifications tipped in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X