రెండు సంవత్సరాల వారంటీతో లావా స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ లావా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్ పై రెండు సంవత్సరాల వారంటీని ప్రకటించింది. పలు ఫీచర్ ఫోన్ మోడల్స్ పై ఈ వారంటీ అందుబాటులో ఉంటుందని లావా తెలిపింది. తమ బ్రాండ్ నుంచి భవిష్యత్‌లో లాంచ్ కాబోయే అన్ని ఫోన్‌లకు రెండేళ్ల వారంటీ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

రెండు సంవత్సరాల వారంటీతో లావా స్మార్ట్‌ఫోన్‌లు

Read More : JioPhone ప్రీ-బుకింగ్ స్టేటస్ తెలుసుకోవటం ఎలా..?

ఆగష్టు 26 తరువాతి నుంచి కొనుగోలు చేసే లావా ఫోన్‌ల పై ఈ వారంటీ అనేది వర్తిస్తుందని లావా ప్రకటించింది. తమకు దేశవ్యాప్తంగా 1000 సర్వీసు సెంటర్లు ఉన్నాయని, వీటి ద్వారా వారంటీని పొందవచ్చని లావా వెల్లడించింది. ఫోన్ యాక్సెసరీస్ పై 6 నెలలు, టచ్ ప్యానల్ లేదా ఎల్‌సీడీ డిస్‌ప్లే పై అమలులో ఉన్న సంవత్సరం స్టాండర్డ్ వారంటీ క్లాస్ ఫీచర్ అలానే స్మార్ట్‌ఫోన్ మోడల్స్ పై అప్లై అవుతుందని లావా తెలిపింది. రెండు సంవత్సరాల వారంటీ వర్తించే ఫోన్‌లకు సంబంధించిన వివరాలను లావా వెబ్‌సైట్‌లో చూడొచ్చని కంపెనీ తెలిపింది.

English summary
Lava Announces 2-Year Warranty for Its Smartphones and Feature Phones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot