టాలెంట్ అదిరింది... అవార్డు వరించింది!

Posted By: Staff

 టాలెంట్ అదిరింది... అవార్డు వరించింది!

 

ప్రముఖ సెల్‌ఫోన్‌ల తయారీసంస్థ లావాను ‘బెస్ట్ మొబైల్ హ్యాండ్‌సెట్ డిజైనింగ్ కంపెనీ ఇన్ ఇండియా’పురస్కారం వరించింది. ఇంటర్నేషన‌ల్ టెలికం యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హామడన్ టూర్ ఈ అవార్డును లావా సంస్థ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్ ఎస్.ఎస్.రాయ్‌కు అందజేశారు. ప్రపంచ టెలికం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ‘కమ్యూనికేషన్స్ మల్టీమీడియా అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్’ (సీఎంఏఐ) నేషనల్ టెలికం బహుమతులను ప్రకటిస్తుంది. 2012కుగాను ప్రకటించిన నేషనల్ టెలికం అవార్డులకు లావా ఎంపికైంది.

ఈ సందర్భంగా కంపెనీ సహ వ్యవస్థాపకులు రాయ్ మాట్లాడుతూ మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా తమ వినియోగదారులకు అత్యున్నత శ్రేణి మొబైళ్లను అందించడానికి తమ బ్రాండ్ తోడ్పడుతుందని తెలిపారు. లావా డిజైన్ చేసిన ఏ16, ఎస్12, సీ31 మోడళ్లకుగాను ఈ అవార్డు లభించినట్లు తెలిపారు.

లావా ఏ16:

మొబైల్ ఫోన్‌ల ఉత్పత్తిదారు ‘లావా’(Lava) ఇప్పటికే పలు వేరియంట్‌లలో ఫోన్లను విడుదల చేసి ఆశాజనకమైన అమ్మకాలు సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ బ్రాండ్ ఎంటీవీ ఇండియాతో కలిసి ఉత్తమమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో కూడిన

‘లావా ఏ 16 ఎమ్‌టీవీ’ (Lava A16 MTV) బ్రాండెడ్ మొబైల్‌ను లాంఛ్ చేసింది.

ఫోన్ ప్రధాన ఆకర్షణలు:

* అందమైన స్టైలింగ్, * యానిమేటెడ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్, * 2.6 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్, * 3.2 మెగా పిక్సల్ కెమెరా, * యమహా పోర్టబుల్ ఆడియో సిస్టం, * టైపింగ్‌కు అనువుగా ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్, * హై డెఫినిషన్ సామర్ధ్యం గల ఇయర్ ఫోన్స్, * ముందుగానే లోడ్ చేసిన సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్, * ధర రూ.4,000.

పనితీరు:

పనితీరు విషయంలో ‘లావా ఏ 16 ఎమ్‌టీవీ’ ముందంజలో ఉంటుంది. డిస్‌ప్లే వ్యవస్థ మన్నికైన హై రిసల్యూషన్ ప్రకాశవంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. 3.2 మెగా పిక్సల్ సామర్ధ్యం గల కెమెరా మీరు గడిపిన మధర క్షణాలను రియాల్టీ లుక్‌తో స్పందిస్తుంది. పొందుపరిచిన యమహా పోర్టబుల్ ఆడియో సిస్టం ఉత్తమమైన మల్టీ ఆడియో అనుభూతిని కలిగిస్తుంది.

లావా ఎస్12 ఫీచర్లు:

తక్కువ ధరలో మొబైల్స్‌ని విడుదల చేస్తున్న లావా మొబైల్స్ మార్కెట్లోకి కొత్తగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి కొత్త మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దాని పేరు ‘లావా ఎస్12′. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌లుగా రూపొదించడంతో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 480 x320 ఫిక్సల్‌గా తయారు చేయడం జరిగింది.

ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో గూగుల్ ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. స్క్రీన్ డిస్ ప్లే HVGA TFT టచ్ స్క్రీన్ డిస్ ప్లే‌తో తయారు చేయబడింది. 600 MHz పవర్ పుల్ క్వాలికామ్ 7227 ప్రాసెసర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇందులో ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot