బడ్జెట్ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో Lava Blaze 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్!
ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ lava, సరికొత్త మోడల్ మొబైల్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. Lava Blaze 5G పేరుతో సరికొత్త మోడల్ మొబైల్‌ను సోమవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 (IMC) వేదికగా ఈ సరసమైన Lava Blaze 5G భారతదేశంలో సోమవారం ప్రారంభించబడింది.

ఈ హ్యాండ్‌సెట్‌ను కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. కొత్త Lava Blaze 5G మొబైల్ బ్యాక్‌సైడ్ AI- సపోర్టు గల ట్రిపుల్ కెమెరాలతో వస్తుంది. మరియు ఇది MediaTek డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై నడుస్తుంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. Lava Blaze 5G 128GB ఇంబిల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడిన 4GB RAMని ప్యాక్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
భారతదేశంలో Lava Blaze 5G ధర:
భారతదేశంలో కొత్తగా లాంచ్ చేసిన Lava Blaze 5G ధర ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో సుమారు రూ.10 వేల వరకు అని లావా ఒక పత్రికా ప్రకటన ద్వారా ధృవీకరించింది. లావా బ్లేజ్ 5G కోసం ప్రీ-బుకింగ్ దీపావళి నాటికి ప్రారంభమవుతుంది.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్:
Lava Blaze 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.51-అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ Widevine L1 మద్దతును అందిస్తుంది. 5G స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్‌తో 7nm MediaTek డైమెన్సిటీ 700 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4GB ఇన్‌బిల్డ్ ర్యామ్‌ను ప్యాక్ చేస్తుంది, ఉచిత స్టోరేజ్‌ని ఉపయోగించి అదనంగా 3GB వర్చువల్ ర్యామ్‌ను జోడించే ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. Lava Blaze 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై రన్ అవుతుంది.
ఇక కెమెరాల విషయానికొస్తే.. Lava Blaze 5G మొబైల్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన AI- బ్యాక్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం, ఇది ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. Lava Blaze 5G మొబైల్ 128GB ఇంటర్నల్ స్టోరేజీ తో అమర్చబడింది. అంతేకాకుండా, ఇది భద్రత కోసం ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.
కొత్త Lava Blaze 5G ఇటీవల లాంచ్ అయిన Lava Blaze Proకి సమానమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. భారతదేశంలో లావా బ్లేజ్ ప్రో బేస్ వేరియంట్ 4GB + 64GB ధర రూ.10,499 గా ఉంది.

Lava Blaze Proస్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లు కూడా తెలుసుకుందాం:
Lava Blaze Pro మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. HD+ (720x1,600 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల 2.5D కర్వ్డ్ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. సెల్ఫీ కెమెరా డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ ఆకారపు నాచ్‌లో ఉంచబడింది. ఇంకా, ఈ మొబైల్ ఆక్టా-కోర్ MediaTek Helio G37 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీనికి, 4GB RAM మరియు 64GB వరకు స్టోరేజ్ అందిస్తున్నారు. అదనంగా, ఫోన్‌లో 3GB వర్చువల్ RAM ఉంది మరియు అంతేకాకుండా, 256GB వరకు స్టోరేజీని పెంచడానికి మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఇకపోతే, ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా నడుస్తుంది.


Click it and Unblock the Notifications








