50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, అమోలెడ్ డిస్‌ప్లే 5G ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా నుంచి ఈ నెలలో లావా బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. రెండు డిస్‌ప్లేలతో అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 50MP సోనీ కెమెరా, 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆ ఫోన్ ప్రారంభ ధర రూ.16999 గా ఉంది.
గత సంవత్సరం లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ (Lava Blaze Amoled 2 5G Smartphone) లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే, IP64 రేటింగ్ ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ పై డిస్కౌంట్ ను పొందవచ్చు.

లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో ( Amazon Great Republic Day Sale 2026 ) అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో భాగంగా SBI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు.
అమోలెడ్ డిస్‌ప్లే :
లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, HDR ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫిథర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్స్ తో, 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంది. దీంతోపాటు వెనుక వైపు LED ఫ్లాష్ లైట్ ఉంది. పొర్ట్రెయిట్, బ్యూటీ, డ్యూయల్ వ్యూ వీడియో, HDR ఫీచర్లున్నాయి.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi, బ్లూటూత్ 5.2, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు ఉంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకమైన కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన ఆడియో సపోర్టు కోసం స్టీరియో స్పీకర్ లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








