బడ్జెట్ ధరలో అమోలెడ్ డిస్‌ప్లే 5G ఫోన్ కోసం చూస్తున్నారా..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా నుంచి భారత్ మార్కెట్ లో ఎంట్రీ, బడ్జెట్ ధర సెగ్మెంట్ లో అనేక 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల కాలంలోనూ అనేక మోడల్స్ ను లాంచ్ చేసింది. లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ ను (Lava Blaze Amoled 2 5G Smartphone) ఇటీవల తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఫుల్ HD+ డిస్‌ప్లే, IP64 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. 5000mAh బ్యాటరీ ని కలిగి ఉంది.
రూ.1000 డిస్కౌంట్ :
లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13499 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు.

ఫుల్ HD+ డిస్‌ప్లే, IP64 రేటింగ్ :
లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR ను సపోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఫిథర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 16 తోపాటు రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ లావా హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 SoC ప్రాసెసర్ తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఒక ఆండ్రాయిడ్ OS అప్‌డేట్ (ఆండ్రాయిడ్ 16) తోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తోంది.

5000mAh బ్యాటరీ :
లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకమైన కూలింగ్ ఛాంబర్‌ను అమర్చి ఉంది. ఫలితంగా ఫోన్ అతిగా వేడెక్కకుండా చూస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్ ను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ వెనుక కెమెరాలు HDR, పొర్ట్రెయిట్, బ్యూటీ, డ్యూయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.
కనెక్టివిటీ పరంగా లావా 5G స్మార్ట్‌ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.2, వైఫై, USB-C, GPS ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్‌తోపాటు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications