బడ్జెట్ ధరలో మంచి డిస్‌ప్లే ఫోన్ కోసం చూస్తున్నారా... అయితే ఇవాళ్టి నుంచే ఈ ఫోన్ సేల్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా నుంచి గత నెలలో లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. రూ.10 వేల ధరలో అందుబాటులోకి వచ్చింది. డిజైన్ పరంగానూ ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. అయితే లావా ఆగస్టులోనూ బడ్జెట్ ధరలో మరో హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చింది. లావా బ్లేజ్ అమోలెడ్ 2 పేరుతో (Lava Blaze AMOLED 2 5G Smartphone Sale) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ అమోలెడ్ డిస్‌ప్లే సహా అనేక మెరుగైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
ఇవాళ్టి నుంచే సేల్ :
లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13499 గా ఉంది. ఫిథర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

FHD+ అమోలెడ్ డిస్‌ప్లే :
లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
2 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
లావా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB LPDDR ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్, 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని లావా తెలిపింది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX752 ప్రైమరీ, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్ ను కలిగి ఉంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకమైన కూలింగ్ ఛాంబర్‌ను అమర్చి ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.2, USB-C, GPS ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
రూ.9,999 ధరకే లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్ :
జులై నెలలో లావా బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధర రూ.9,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గోల్డ్ మిస్ట్, మిడ్‌నైట్ మిస్ట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ లావా ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత క్లీన్ OS పై పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP AI కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








