రూ.12,840 ధరకే 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే సహా..!
లావా నుంచి భారత్ మార్కెట్ లో ఈ నెల 20 వ తేదీన లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్, డ్యూయల్ కెమెరాలతో అందుబాటులోకి రానుంది.
అయితే ప్రస్తుతం లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ (Lava Blaze Amoled 2 5G Smartphone) ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499 గా ఉండేది.

రూ.12,840 ధరకే 5G స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం అమెజాన్‌లో పెథర్ వైట్ కలర్ వేరియంట్ ను రూ.12,840 ధరకు కొనుగోలు చేయవచ్చు. స్పార్కిలింగ్ బ్లాక్ కలర్ వేరియంట్ లోనూ అందుబాటులో ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.
ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే :
లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, HDR సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ తోపాటు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది.
2 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ లావా ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌తోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
5000mAh బ్యాటరీ, కూలింగ్ ఛాంబర్ :
మల్టీ టాస్కింగ్ సహా ఇతర సమయాల్లో థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకమైన కూలింగ్ ఛాంబర్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ లావా స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్ ను కూడా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కెమెరాలు HDR, డ్యూయల్ వ్యూ వీడియో, పొర్ట్రెయిట్, బ్యూటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
స్టీరియో స్పీకర్ :
లావా బ్లేజ్ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.2, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్ లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








