Home
Mobile

రూ.15 వేల ధరలో సన్నని డిజైన్‌, అమోలెడ్‌ డిస్‌ప్లే సహా బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌.. విడుదల వివరాలు!

Lava Blaze Amoled 2 Smartphone : లావా నుంచి ఇటీవల లావా బ్లేజ్‌ డ్రాగన్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. సేల్‌ కూడా ప్రారంభం అయింది. రూ.10 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. లావా నుంచి త్వరలో మరో హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుంది.

రెండు కలర్‌ వేరియంట్స్ :
లావా బ్లేజ్‌ అమోలెడ్‌ 2 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. గత సంవత్సరం విడుదల అయిన లావా బ్లేజ్‌ అమోలెడ్ హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లాక్, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లభిస్తుందని తెలుస్తోంది.

Lava Blaze Amoled 2 Smartphone colours

స్లిమ్ డిజైన్ :
లావా బ్లేజ్‌ అమోలెడ్ 2 స్మార్ట్‌ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు యూజర్లకు మెరుగైన అనుభూతిని అందిస్తుందని లావా చెబుతోంది. అయితే ఈ ఫోన్‌ సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 174 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.

ఎప్పుడు విడుదల కానుంది? :
ఈ హ్యాండ్‌సెట్‌ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చే విధంగా ప్రీమియం గ్రేడ్ మెటీరియల్స్‌ను ఉపయోగించారు. దీంతోపాటు ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ లావా బ్లేజ్‌ అమోలెడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు 11 వ తేదీన భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుంది.

Lava Blaze Amoled 2 Smartphone colours

డిస్‌ప్లే వివరాలు :
లావా బ్లేజ్‌ అమోలెడ్ 2 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు పంచ్‌ హోల్‌ కటౌట్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే భారత్ మార్కెట్లో ఈ ఫోన్‌ రూ.15 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుంది..

ఈ లావా ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ LPDDR5 ర్యామ్‌, UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 50MP సోనీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

IR బ్లాస్టర్ :
లావా బ్లేజ్ అమోలెడ్ 2 స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతోపాటు మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. మరియు IR బ్లాస్టర్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Take a Poll

* గత నెలలో విడుదల అయిన లావా బ్లేజ్‌ డ్రాగన్‌ 5G ఫోన్‌ రూ.9999 గా ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. గోల్డ్‌ మిస్ట్‌, మిడ్‌నైట్ మిస్ట్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత క్లీన్ OS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP AI కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze Amoled 2 Smartphone launch date and key features revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X