Home
Mobile

64MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, 8GB ర్యామ్‌, కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 5G ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్..!

భారత్‌ మార్కెట్‌ లో గత సంవత్సరం లావా నుంచి ఆకట్టుకొనే డిజైన్‌, మెరుగైన ఫీచర్‌ లతో 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ, 8GB ర్యామ్‌ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సోనీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్‌ కొనుగోలుపై సంవత్సరం వరకు వారంటీని పొందవచ్చు. విడుదల ధరతో పోలిస్తే డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌, ఫీచర్ల పూర్తి వివరాలు.

స్టోరేజీ వేరియంట్‌లు, ధరల వివరాలు :
లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ విడుదల సమయంలో ధరలు రూ.17,999, రూ.18,999 గా ఉన్నాయి. ప్రస్తుతం అమోజాన్‌ లో ఈ ఫోన్‌ ను రూ.3000 డిస్కౌంట్‌ తో కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze Curve 5G Smartphone

రూ.15000 కంటే తక్కువ ధరకే :
డిస్కౌంట్‌ కారణంగా ఈ ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. ఈ ఫోన్‌ గ్లాస్‌ ఐరన్, గ్లాస్‌ విరీడియన్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ పై సంవత్సరం వారంటీ అందిస్తున్నట్లు లావా తెలిపింది.

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
లావా 5G స్మార్ట్‌ఫోన్‌ (Lava Blaze Curve 5G Smartphone) 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే widevine L1 రక్షణను పొందుతుంది.

Lava Blaze Curve 5G Smartphone

మీడియాటెక్ చిప్‌సెట్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR5 ర్యామ్‌ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత క్లీన్‌ OS ను కలిగి ఉంది. మూడు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌ లు, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను అందిస్తుంది.

64MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ధర సెగ్మెంట్‌లో మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను అమర్చారు. f/1.9 అపేచర్‌తో 64MP సోనీ ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌, 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.

5000mAh బ్యాటరీ :
లావా బ్లేజ్‌ కర్వ్ 5G హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. మరియు భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze Curve 5G Smartphone gets Rs3000 price drop on amazonn check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X