Home
Mobile

64MP కెమెరా, 8GB ర్యామ్‌తో లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో లాంచ్‌ చేయనుంది. మార్చి 5వ తేదీన లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G (Lava Blaze Curve 5G Smartphone) విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

భారత్‌ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్‌ కానుందంటే..: ఈ లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. అయితే లావా సంస్థ ఇప్పటి వరకు ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వివరాలను వెల్లడించలేదు. భారత్‌ మార్కెట్‌లో మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్‌ మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంటుంది.

Lava Blaze curve 5G Smartphone launch date

కర్వడ్‌ డిస్‌ప్లే, సెంటర్‌ పంచ్‌ హోల్‌ డిజైన్‌ : లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (Lava New Smartphone) కర్వడ్‌ డిస్‌ప్లే సహా సెంటర్‌ పంచ్‌ హోల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వాల్యూమ్‌ మరియు పవర్‌ బటన్లు హ్యాండ్‌సెట్‌ కుడివైపున ఉంటాయి. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ! : లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల అమోలెడ్‌ పుల్‌ HD+ డిస్‌ప్లేతో విడుదలయ్యే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. లావా కొత్త హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ 8GB ర్యామ్‌ మరియు 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉండే అవకాశం ఉంది.

Lava Blaze curve 5G Smartphone launch date

64MP ప్రధాన కెమెరా : ఈ లావా కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ లావా స్మార్ట్‌ ఫోన్‌ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరా మరియు అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చినట్లు సమాచారం.

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ ధర : లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.16,000 నుంచి రూ.19,000 మధ్యను ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై లావా సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. దీంతోపాటు విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze curve 5G Smartphone india launch date confirmed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X