Home
Mobile

64MP కెమెరా, కర్వడ్‌ డిస్‌ప్లే, 8GB ర్యామ్‌తో లావా స్మార్ట్‌ఫోన్‌... స్పెసిఫికేషన్లు, సేల్‌ వివరాలు

భారతీయ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా ఇవాళ కొత్త హ్యాండ్‌సెట్‌ను లాంచ్‌ చేసింది. భారత్ మార్కెట్‌లో తన స్మార్ట్‌ఫోన్‌ విస్తరించే క్రమంలో లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G (Lava Blaze Curve 5G Smartphone) ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ కర్వడ్‌ డిస్‌ప్లే సహా 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. దీంతోపాటు మూడు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్లతోపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని లావా సంస్థ హామీ ఇచ్చింది.

Lava Blaze Curved 5G features

ఈ లావా కొత్త హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ 8GB LPDDR5 ర్యామ్‌ మరియు 256GB UFS 3.1 స్టోరేజీ వరకు జతచేయబడి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు అదనంగా 8GB వరకు వర్చువల్‌గా విస్తరించవచ్చు.

32MP సెల్ఫీ కెమెరా : కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ లావా బ్రేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్ 32MP కెమెరాలను కలిగి ఉంటుంది.

Lava Blaze Curved 5G features

33W ఫాస్ట్‌ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీ : ఈ కొత్త లావా స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పూర్తి సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా ఒకరోజుపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుందని పేర్కొంది.

లావా బ్లేజ్‌ కర్వ్ 5G ధర, సేల్‌ వివరాలు : లావా బ్లేజ్‌ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్.. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.18,999 గా ఉంది. మార్చి 11 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌, లావా ఆన్‌లైన్‌ స్టోర్‌ సహా లావా రిటైల్‌ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze Curved 5G features

రెండు రంగుల్లో లభిస్తుంది : అయితే ఈ లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ధరను మరింత తగ్గించేందుకు అమెజాన్‌ కొన్ని బ్యాంకు ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మరియు ఈ లావా కొత్త హ్యాండ్‌సెట్‌ ఐరన్‌ గ్లాస్‌ మరియు విరీడియన్‌ గ్లాస్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze Curved 5G Smartphone launched in india with curved display
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X