Home
Mobile

రూ.8999 ధరకే ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50MP AI కెమెరా, HD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా గత నెలలో లావా బ్లేజ్‌ డ్రాగన్ స్మార్ట్‌ఫోన్‌ ను (Lava Blaze Dragon 5G Smartphone) లాంచ్‌ చేసింది. రూ.10 వేల ధరలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఎంట్రీ లెవల్ ధరలో లాంచ్‌ అయినా ప్రీమియం డిజైన్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 50MP, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

రూ.1000 డిస్కౌంట్‌ :
లావా బ్లేజ్‌ డ్రాగన్‌ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల EMI లావాదేవీలపై రూ.1000 డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

Lava Blaze Dragon 5G Smartphone

రెండు కలర్‌ వేరియంట్స్ :
ఫలితంగా రూ.8999, రూ.9999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల నాన్‌ - EMI లావాదేవీలపై రూ.500 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ లావా బ్లేజ్‌ డ్రాగన్‌ 5G స్మార్ట్‌ఫోన్ గోల్డ్‌ మిస్ట్‌, మిడ్‌నైట్ మిస్ట్‌ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

HD+ డిస్‌ప్లే :
లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది.

Lava Blaze Dragon 5G Smartphone

రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్ వర్చువల్‌ ర్యామ్ ఆప్షన్‌ ను కూడా కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ లావా స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌, 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని లావా తెలిపింది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50MP కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ 50MP AI కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP కెమెరాతో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ కెమెరాలు స్లో మోషన్, నైట్‌ మోడ్‌, పనోరమా మోడ్, టైం ల్యాప్స్‌, ఫిల్టర్స్‌, ప్రో మోడ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

5G సపోర్టు :
లావా బ్లేజ్‌ డ్రాగన్‌ 5G స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్‌, WiFi, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze Dragon 5G Smartphone gets discount price on amazon, specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X