రూ.9999 కే ప్రీమియం డిజైన్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Lava Blaze Dragon 5G Smartphone Sale : లావా సంస్థ భారత్ మార్కెట్ లో గత వారం లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9999 గా ఉంది. ఎంట్రీ లెవల్ ధర వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చినా.. అనేక బెస్ట్ ఫీచర్ లను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ ప్రీమియం లుక్ ను కలిగి ఉంటుంది. ఈ లావా స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ధర రూ.9999 :
లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫోన్ కేవలం 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ లోనే అందుబాటులోకి వచ్చింది. ధర రూ.9999 గా ఉంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

రూ.1000 డిస్కౌంట్, హోం సర్వీస్ :
అమెజాన్ లో ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. లావా స్మార్ట్‌ఫోన్ గోల్డ్ మిస్ట్, మిడ్‌నైట్ మిస్ట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. అయితే ఇంటి వద్దనే ఉచితంగా సర్వీస్ పొందే అవకాశం కూడా లావా కల్పిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్ AnTuTu స్కోర్ 450k+ గా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత క్లీన్ OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్ తోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.

HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ :
లావా స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. 20:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
50MP కెమెరా సహా అనేక ఫీచర్లు :
కెమెరా విభాగం పరంగా లావా బ్లేజ్ డ్రాగన్ హ్యాండ్‌సెట్ వెనుక వైపు 50MP AI కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ కెమెరాలు పనోరమా మోడ్, టైం ల్యాప్స్, స్లో మోషన్, నైట్ మోడ్, ఫిల్టర్స్, ప్రో మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ ఫీచర్లు :
లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్ అన్ని ప్రధాన 5G బ్యాండ్ లను సపోర్టు చేస్తుందని సంస్థ తెలిపింది. 5G తోపాటు 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








