రూ.10 వేల కంటే తక్కువ ధరలో 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్..!
లావా నుంచి ఇటీవల అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. త్వరలో లావా బ్లేజ్ డుయో 3 5G ఫోన్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే రూ.10 వేల ధరలో లావా ఈ సంవత్సరం విడుదల చేసిన లావా బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్ అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
ధర, సేల్ వివరాలు :
అమెజాన్‌లో లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్ (Lava Blaze Dragon 5G Smartphone) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9998, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ మిడ్‌నైట్ మిస్ట్, గోల్టె్న్ మిస్ట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.

డిస్‌ప్లే వివరాలు :
డిజైన్ పరంగా లావా బ్లేజ్ డ్రాగన్ 5G హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్, 450 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ చిప్, 2 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్ తోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. ఫలితంగా ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంటుంది.
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP AI కెమెరాను కలిగి ఉంది. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కెమెరా ఫీచర్లు :
ఈ ఫోన్ స్లో మోషన్, నైట్ మోడ్, టైమ్ ల్యాప్స్, ఫిల్టర్స్, ప్రో మోడ్, పనోరమ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఈ హ్యాండ్‌సెట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
రూ.10 వేల ధరలో ఫోన్‌ల కోసం చూస్తున్న వారు ఈ హ్యాండ్‌సెట్‌ను పరిశీలించవచ్చు. ప్రీమియం డిజైన్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును ఈ ఫోన్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








