Home
Mobile

రూ.9999 కే 5G స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే డిజైన్‌, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌!

Lava Blaze Dragon Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా భారత్‌ మార్కెట్‌లో రూ.10 వేల ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా బ్లేజ్‌ డ్రాగన్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు ప్రీమియం లుక్‌తో అందుబాటులోకి వచ్చింది. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి అనేక ఆకట్టుకొనే ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
లావా స్మార్ట్‌ఫోన్‌ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 450 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిజైన్‌ ఆకట్టుకుంటుంది. 20:9 యాస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది.

Lava Blaze Dragon Smartphone launched in india

చిప్‌సెట్‌ వివరాలు :
లావా బ్లేజ్‌ డ్రాగన్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ AnTuTu స్కోర్‌ 450k+ గా ఉందని లావా తెలిపింది. ఈ ఫోన్‌లో వర్చువల్‌ ర్యామ్ ఆప్షన్‌ కూడా ఉంది.

రెండు సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ లావా బడ్జెట్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత క్లీన్ OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌తోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని లావా వెల్లడించింది.

Lava Blaze Dragon Smartphone launched in india

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు 50MP AI కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ కెమెరా పనోరమా మోడ్, స్లో మోషన్, టైం ల్యాప్స్‌, నైట్‌ మోడ్‌, ఫిల్టర్స్‌, ప్రో మోడ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ అన్ని ప్రధాన 5G బ్యాండ్‌లను సపోర్టు చేస్తుందని లావా తెలిపింది. బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

లావా బ్లేజ్‌ డ్రాగన్‌ స్మార్ట్‌ఫోన్ ధర సేల్‌ వివరాలు :
ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. ఈ ఫోన్ సేల్‌ ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

గోల్డ్‌ మిస్ట్‌, మిడ్‌నైట్ మిస్ట్‌ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు రూ.1000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను కూడా అందిస్తుంది. ఇంటి వద్దనే ఉచితంగా సర్వీసింగ్‌ అవకాశం కూడా కల్పిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze Dragon Smartphone launched in india at rs9999 price here are the features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X