రెండు డిస్‌ప్లేలు, 50MP AI కెమెరా, ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్..!
లావా నుంచి డ్యూయల్ డిస్‌ప్లేతో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందని ఇటీవలే లీక్స్ వచ్చాయి. ఇప్పటికే లావాలో రెండు డిస్‌ప్లేలతో లావా బ్లేజ్ డుయో 3, లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా కొత్త ఫోన్ కు సంబంధించిన వివరాలను ధ్రువీకరించింది. భారత్ మార్కెట్ లో త్వరలో లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ (Lava Blaze Duo 3 Smartphone) విడుదల కానుందని తెలిపింది.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
కొత్త ఫోన్ వివరాలను లావా X పోస్ట్ లో షేర్ చేసింది. బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వివరాలు వెల్లడి కాలేదు. అయితే డిజైన్ వెల్లడయింది. దీర్ఘచతురస్రాకార కెమెరా డిజైన్ ను కలిగి ఉంది. వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP AI కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంటుంది. 2K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. 8MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది.

వెనుక వైపున మరో డిస్‌ప్లే :
లావా బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ రెండు వెనుక వైపు కూడా చిన్న డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేతో నోటిఫికేషన్‌లు, క్యాప్చర్ సెల్ఫీ, మ్యూజిక్ కంట్రోల్ సహా అనేక యాప్స్ ను సులభంగా వినియోగించుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
అమెజాన్ లో :
ఈ ఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. అయితే అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ అనేక వివరాలు లీక్ అయ్యాయి. దీని ఆధారంగా ఈ లావా బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 1.6 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ చిప్ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ సహా మరిన్ని స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉందని తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.2, GPS, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు, మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్ లు ఉంటాయని సమాచారం.
లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదలను సంస్థ ప్రకటించినా.. కచ్చితమైన లాంచ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. త్వరలో ఈ వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








