లావా నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు లీక్..!
లావా నుంచి భారత్ మార్కెట్ లో ఇటీవలే అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, 50MP సెల్ఫీ కెమెరా, అల్యూమినియం మెటల్ ఫ్రేమ్, AG గ్లాస్ ప్రొటెక్షన్, యాంటీ డ్రాప్ డైమండ్ ఫ్రేమ్ ప్రొటెక్షన్ ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు 1.5K డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. త్వరలో లావా నుంచి బ్లేజ్ డుయో 3 5G ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది.
కీలక వివరాలు లీక్ :
లావా బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ (Lava Blaze Duo 3 5G Smartphone) విడుదలపై సంస్థ ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే టిప్‌స్టర్ సంజు ఛౌదరి X పోస్ట్ ద్వారా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ లు, ధర వివరాలను వెల్లడించారు. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని టిప్‌స్టర్ తెలిపారు.

రెండు డిస్‌ప్లేలు :
ఈ లావా బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుందని తెలిపారు. అయితే ఈ ఫోన్ వెనుక వైపు 1.6 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు. గత సంవత్సరం లాంచ్ అయిన అగ్ని 3 5G ఫోన్ కూడా రెండు డిస్‌ప్లేలతో అందుబాటులోకి వచ్చింది.
మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ :
ఈ బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 SoC చిప్‌సెట్ తో లాంచ్ కానుందని అంచనా వేశారు. ఈ చిప్ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలిపారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని చెప్పారు.
Exclusive 💫
— Sanju Choudhary (@saaaanjjjuuu) December 20, 2025
LAVA Blaze DUO 3 is launching this month in India :
Specs:
• 6.67” FHD+ AMOLED screen
• 1.6” rear display
• MTK 7060
• 6GB LPDDR5 + 128GB UFS 3.1
• 50MP IMX752 Main
• 5000mAh + 33W
• 7.55mm, 181gm , IP64
• around 15k
50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. టిప్‌స్టర్ సంజు తెలిపిన వివరాల ఆధారంగా వెనుక వైపు 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే సెకండరీ, సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.
7.55 mm థిక్‌నెస్, IP64 రేటింగ్ :
లావా బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ 7.55mm థిక్‌నెస్ తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. 181 గ్రాముల బరువుతో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
లావా బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో ఈనెల లోనే విడుదల కానుందని తెలిపారు. మరియు రూ.15 వేల ధర రేంజ్ లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే ఈ హ్యాండ్‌సెట్ విడుదలపై లావా ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. త్వరలో మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








