రెండు డిస్‌ప్లేలు, 50MP సోనీ కెమెరా, 5000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ విడుదల..!
Lava Blaze Duo 3 Smartphone : లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో లాంచ్ అయింది. ఈ ఫోన్ రెండు కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 50MP సోనీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ త్వరలో ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్ ను పొందుతుందని చెబుతోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్ ను కలిగి ఉంది. రెండు డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ ప్రైమరీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ముందు వైపు పంచ్ హోల్ కటౌట్ ను కలిగి ఉంది.

వెనుక వైపు 1.6 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ సెకండరీ కెమెరాతో నోటిఫికేషన్ లు తనిఖీ చేయడం, మ్యూజిక్ కంట్రోల్ సహా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే లావా నుంచి డ్యూయల్ డిస్‌ప్లేలతో రెండు ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి.
మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 6GB వరకు వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP సోనీ IMX752 సెన్సర్, మరో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
IR బ్లాస్టర్, స్టీరియో స్పీకర్లు :
ఈ ఫోన్ మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లు ఉన్నాయి. IR బ్లాస్టర్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
ఈ ఫోన్ 7.55mm థిక్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌తోపాటు రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని లావా చెబుతోంది.
లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.16999 గా ఉంది. ఇవాళ్టి నుంచే కొనుగోలు చేయవచ్చు. మూన్‌లైట్ బ్లాక్, ఇంపీరియల్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. SBI క్రెడిట్ కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








