Home
Mobile

ధర రూ.16,999 కే రెండు డిస్‌ప్లేలు, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

లావా నుంచి భారత్‌ మార్కెట్‌లోకి రెండు డిస్‌ప్లేలతో 5G స్మార్ట్‌ఫోన్‌ (Lava Blaze Duo 5G Smartphone Launched) విడుదల అయింది. లావా బ్లేజ్‌ డుయో 5G పేరుతో ఈ హ్యాండ్‌సెట్‌ను లావా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్‌ అయిన లావా అగ్ని 3 హ్యాండ్‌సెట్‌ కూడా రెండు డిస్‌ప్లేలను కలిగి ఉంది. డుయో హ్యాండ్‌సెట్ 3D కర్వడ్‌ డిస్‌ప్లే, ప్రీమియం మ్యాటీ ఫినిష్‌ డిజైన్‌ను కలిగి ఉంది.

లావా బ్లేజ్‌ డుయో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల (1080*2400 పిక్సల్స్‌) FHD+ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రైమరీ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. మరియు 1.58 అంగుళాల (228*460 పిక్సల్స్‌) అమోలెడ్‌ సెకండరీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Lava blaze duo 5G Smartphone sale

ఈ రెండో డిస్‌ప్లేను లావా ఇన్‌స్టా స్క్రీన్‌గా పిలుస్తోంది. ఈ స్క్రీన్‌తో నోటిఫికేషన్‌లు చూసేందుకు వీలుంది. దీంతోపాటు వాయిస్‌ రికార్డింగ్‌, స్టాప్‌వాచ్‌, టైమర్‌, వాతావరణ అప్‌డేట్‌లను పొందవచ్చు. ఈ డిస్‌ప్లే తో కాల్స్‌కు స్పందించవచ్చు. ఈ ధర సెగ్మెంట్‌లోనే రెండు స్క్రీన్ కలిగిన తొలి ఫోన్‌ ఇదేనని లావా చెబుతోంది.

ఈ రెండు డిస్‌ప్లే లావా 5G స్మార్ట్‌ఫోన్‌ 6nm మీడియాటెక్‌ 7025 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 6GB/ 8GB LPDDR5X ర్యామ్‌ మరియు 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. 8GB ర్యామ్‌ + 8GB వర్చువల్‌ ర్యామ్‌ ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంది.

Lava blaze duo 5G Smartphone sale

అయితే త్వరలోనే లావా బ్లేజ్‌ డుయో 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 OS ను పొందుతుందని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రెండు వేరియంట్‌లో లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ లావా 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 64MP సోనీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను అమర్చారు. దీంతోపాటు వెనుక వైపు LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ డుయో 5G స్మార్ట్‌ఫోన్‌ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

Lava blaze duo 5G Smartphone sale

ఈ లావా హ్యాండ్‌సెట్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇన్‌- డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. USB-C ఛార్జింగ్ పోర్టు, డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్‌ 4G VoLTE, వైఫై 6E, బ్లూటూత్‌ 5.4, GPS వంటి ఫీచర్‌లున్నాయి.

లావా బ్లేజ్‌ డుయో 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌ హ్యాండ్‌సెట్ ధర రూ.16,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.17,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ డిసెంబర్‌ 20 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఆర్కిటిక్ వెట్‌, సెలెస్టియల్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. డిసెంబర్‌ 20 నుంచి 22 మధ్య సమయంలో HDFC బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Image Source : LAVA

More from GizBot

Best Mobiles in India

English summary
Lava blaze duo 5G Smartphone launched in india with dual display and 64MP camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X