రెండు డిస్‌ప్లేలు, 64MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ ధరలో తొలి ఇన్‌స్టా డిస్‌ప్లే ఫోన్..!
భారత్ మార్కెట్ లో లావా నుంచి ఇటీవల లావా బ్లేజ్ డుయో 5G స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు డిస్‌ప్లేను కలిగి ఉంది. అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను (Lava Blaze Duo 5G Smartphone sale) కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డు ద్వారా డిసెంబర్ 22 వ తేదీ వరకు ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసిన వారి రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ లావా డుయో స్మార్ట్‌ఫోన్ 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బడ్జెట్ రేంజ్ ధరలో ఇన్‌స్టా డిస్‌ప్లే కలిగిన ఫోన్ ఇదేనని విడుదల సమయంలో లావా చెబుతోంది.

లావా బ్లేజ్ డుయో 5G ధర :
ప్రస్తుతం లావా బ్లేజ్ డుయో 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ నెల 22 వరకు HDFC బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఆర్కిటిక్ వెట్, సెలెస్టియల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
లావా బ్లేజ్ డుయో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
లావా బ్లేజ్ డుయో 5G హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 1.58 అంగుళాల అమోలెడ్ ఇన్‌స్టా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ సెకండరీ డిస్‌ప్లే ద్వారా నోటిఫికేషన్‌లు, వాతావరణ అప్‌డేట్‌లు, స్టాప్‌వాచ్, వాయిస్ రికార్డింగ్ వంటి చూసేందుకు అవకాశం ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ 15 OS అప్‌డేట్ పొందుతుందని లావా చెబుతోంది. మరియు 6nm మీడియాటెక్ 7025 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 6GB/ 8GB LPDDR5X ర్యామ్ మరియు 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది.
లావా బ్లేజ్ డుయో 5G స్మార్ట్‌ఫోన్ 64MP సోనీ ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టు, GPS వంటి ఫీచర్‌లున్నాయి. దీంతోపాటు భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








