Home
Mobile

ధర రూ.13,999 కే 64MP కెమెరా, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్‌... ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..!

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ లావా ఇవాళ 5G స్మార్ట్‌ ఫోన్‌ లావా బ్లేజ్‌ X 5G ను (Lava Blaze X 5G Smartphone Launched) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 64MP కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. జులై 20 నుంచి ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ ప్రారంభం కానుంది.

లావా బ్లేజ్‌ x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 1080*2400 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 394ppi పిక్సల్‌ డెన్సిటీ తో అందుబాటులోకి వచ్చింది.

Lava Blaze X 5G Smartphone specs

ఈ లావా బ్లేజ్‌ X 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. వర్చువల్‌ ర్యామ్‌ ఫీచర్‌ ద్వారా 16GB వరకు పొడిగించుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది.

మూడు ర్యామ్, స్టోరేజీ వేరియంట్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh Li-Polymer బ్యాటరీని కలిగి ఉంది.

Lava Blaze X 5G Smartphone specs

64MP + 2MP కెమెరాలు :
లావా బ్లేజ్‌ X 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 64MP సోనీ ప్రధాన కెమెరా సహా 2MP కెమెరాలను కలిగి ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీ కోసం 16MP కెమెరాను అమర్చారు. మరియు ముందుపైవు ఫ్లాష్‌ ఉంది.

కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్ 5.3, OTG, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సిలిరోమీటర్‌, యాంబియంట్ లైట్‌, గైరోస్కో్ప్‌, మాగ్నెటోమీటర్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌, IP52 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుంది.

లావా బ్లేజ్‌ X 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్టార్‌లైట్‌ పర్పుల్‌, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze X 5G Smartphone Launched in india with 64MP sony Camera details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X