Home
Mobile

రూ.12999 ధరకు 50MP కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌, AMOLED డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం బడ్జెట్‌ ధరలో అనేక 5G ఫోన్‌లు ఉన్నాయి. బడ్జెట్‌ మోడల్స్‌కు అధిక డిమాండ్‌ ఉండడంతో ప్రముఖ బ్రాండ్‌లు కూడా ఈ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇటీవలే శాంసంగ్‌ సంస్థ రూ.15 వేల కంటే తక్కువ ధరలో గెలాక్సీ F70e, M17e ఫోన్‌లను తీసుకొచ్చింది.

అయితే తాజా లావా సంస్థ బడ్జెట్ ధరలో లావా బోల్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ను (Lava Bold 2 Smartphone) విడుదల చేసింది. గత సంవత్సరం విడుదల అయిన బోల్డ్‌ వేరియంట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, ఫుల్‌ HD+ డిస్‌ప్లే, 50MP AI కెమెరాలను కలిగి ఉంది. ఇంటి వద్దనే సర్వీస్‌ చేస్తామని లావా సంస్థ చెబుతోంది.

Lava Bold 2 Smartphone sale date

లావా బోల్డ్ 2 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఫెదర్‌ వైట్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 7.55mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.

అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఈ లావా బోల్డ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లు ఉన్నాయి.

Lava Bold 2 Smartphone sale date

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్ ను కలిగి ఉంది. 6GB LPDDR5 ర్యామ్‌, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులోకి వచ్చింది. వర్చువల్‌ ర్యామ్‌ ఆప్షన్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

50MP కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP సోనీ AI కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 33W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

లావా బోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది. మార్చి 19 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్ (Amazon) ద్వారా కొనుగోలు చేయవచ్చు.

గత నెలలో బోల్డ్‌ సిరీస్‌ నుంచి లావా బోల్డ్‌ N2 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.7499 గా ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ Unisoc SC9863A ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 గో వెర్షన్ పైన పనిచేస్తోంది. 13MP కెమెరాతోపాటు 5MP సెల్ఫీ కెమెరా ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Bold 2 Smartphone launched in india at Rs12999 price sale to start from march 19
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X