Home
Mobile

తక్కువ ధరలో 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఫోన్‌.. ఇవాళ్టి నుంచే సేల్!

భారత్‌ లో లావా సంస్థ ఇటీవల అనేక ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఈ సంవత్సరం జనవరి నెలలో లావా బ్లేజ్‌ డుయో 3 స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ డ్యూయల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫిబ్రవరి నెలలో ఎంట్రీ లెవల్ ధరలో లావా బోల్డ్‌ N2, లావా యువ స్టార్ 3 స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. అయితే ఈ యువ ఫోన్‌ సేల్‌ ఇంకా ప్రారంభం కాలేదు.

అయితే గత వారం లావా నుంచి బడ్జెట్‌ ధరలో లావా బోల్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ FHD+ డిస్‌ప్లే, 50MP AI కెమెరా, మీడియాటెక్‌ చిప్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇంటి వద్దనే సర్వీసింగ్‌ చేస్తామని లావా హామీ ఇచ్చింది.

Lava Bold 2 sale

రూ.12999 ప్రారంభ ధర :
లావా బోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌ (Lava Bold 2 Smartphone Sale) సేల్‌ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. అమెజాన్ (Amazon) ద్వారా ఈ ఫోన్‌ ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫెదర్‌ వైట్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

లావా ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
లావా బోల్డ్ 2 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంది. 7.55mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

మీడియాటెక్‌ చిప్‌, వర్చువల్‌ ర్యామ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. 6GB LPDDR5 ర్యామ్‌, 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ వర్చువల్‌ ర్యామ్ ఫీచర్‌ కూడా ఉంది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP సోనీ AI కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 33W వైర్‌ ఛార్జింగ్ సపోర్టు ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఉంది.

లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ ప్రైమరీ డిస్‌ప్లే, వెనుక వైపు 1.6 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 50MP సోనీ IMX752 సెన్సర్‌, 8MP సెల్ఫీ కెమెరా, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

Best Mobiles in India

English summary
Lava Bold 2 Smartphone with 50MP Camera, Amoled display sale to start from today on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X