రూ.7499 కే 5G స్మార్ట్‌ఫోన్.. 5000mAh బ్యాటరీ, 3 సంవత్సరాల అప్‌డేట్స్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా భారత్ మార్కెట్‌లో ఇప్పటికే ఎంట్రీ, బడ్జెట్ సెగ్మెంట్స్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. తక్కువ ధరలో లాంచ్ చేస్తున్నా.. ఆకట్టుకొనే డిజైన్, మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటున్నాయి. గత వారం లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్‌ను (Lava Bold N1 5G Smartphone) విడుదల చేసింది. ఈ ఫోన్ అన్ని ఇండియన్ 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుందని లావా చెబుతోంది.
రూ.7499 ధరకే 5G స్మార్ట్‌ఫోన్..! :
లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రస్తుతం ప్రారంభం అయింది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.7499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.7999 గా ఉంది. బ్లూ, గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

HD+ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15 OS :
లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ Unisoc T765 ప్రాసెసర్ పైన పనిచేస్తోంది. వర్చువల్‌గా కూడా ర్యామ్‌ను పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 5000mAh బ్యాటరీ :
ఈ లావా హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 10W ఛార్జర్‌ను అందిస్తున్నట్లు లావా సంస్థ తెలిపింది.

4K వీడియో రికార్డింగ్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 13MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రైమరీ కెమెరా స్లో మోషన్, నైట్, ప్రో, పొర్ట్రెయిట్ మోడ్‌ను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 30fps వద్ద 4k వీడియోను రికార్డు చేయవచ్చు.
IP54 రేటింగ్ :
లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 4.2, WiFi, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
* లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉంది. 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
లావా ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








