రూ.7499 ధరకే 5G స్మార్ట్‌ఫోన్.. 5000mAh బ్యాటరీ, 3 సంవత్సరాల అప్‌డేట్స్..!
లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్ (Lava Bold N1 5G Smartphone) భారత్ మార్కెట్ లో విడుదల అయింది. ఎంట్రీ లెవల్ ధరలోనే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ అన్ని ఇండియన్ 5G సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. లావా 5G ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
లావా హ్యాండ్‌సెట్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ రాయల్ బ్లూ, షాంపైన్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.

1TB వరకు స్టోరేజీ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ Unisoc T765 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్ గా ర్యామ్‌ను పెంచుకొనేందుకు అవకాశం ఉంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 5000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని లావా సంస్థ తెలిపింది. 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. రిటైల్ లో బాక్స్‌లో 10W ఛార్జర్‌ను అందిస్తుంది.
4K వీడియో రికార్డింగ్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను అమర్చి ఉంది. ఇందులో 13MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరా ఉంది. ఈ ప్రైమరీ కెమెరా నైట్, ప్రో, స్లో మోషన్, పొర్ట్రెయిట్ మోడ్ ను కలిగి ఉంది. 30fps వద్ద 4k వీడియోను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ పరంగా లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్ 5G, 4G, వైఫై, బ్లూటూత్ 4.2, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
లావా బోల్డ్ N1 5G ధర, సేల్ వివరాలు :
లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది. ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది.
ప్రారంభ ఆఫర్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డు EMI ట్రాన్సాక్షన్‌పై గరిష్ఠంగా రూ.750 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ రెండు వేరియంట్స్‌ను రూ.6,749, రూ.7,249 ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








