Home
Mobile

రూ.5999, రూ.6699 ధరలతో రెండు స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. 5000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే సహా..!

లావా నుంచి తాజాగా ఎంట్రీ లెవల్‌ ధరలో రెండు ఫోన్‌లు విడుదల అయ్యాయి. లావా బోల్డ్‌ N1, బోల్డ్ N1 ప్రో పేరుతో అందుబాటులోకి (Lava Bold N1 Series Launched) వచ్చాయి. తక్కువ ధరలో విడుదల అయినా.. 5000mAh బ్యాటరీతో పనిచేస్తాయి. ఇందులో ప్రో మోడల్‌ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. లావా బోల్డ్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల పూర్తి వివరాలు.

లావా బోల్డ్‌ N1 స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
ఈ ఫోన్‌ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చినా.. ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Unisoc ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 4GB ర్యామ్‌ + 4GB వర్చువల్‌ ర్యామ్‌తోపాటు 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Go Edition పైన పనిచేస్తుంది.

Lava Bold N1 series smartphone

కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ కెమెరాతోపాటు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను అమర్చారు. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

లావా బోల్డ్ N1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ :
లావా బోల్డ్ N1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ Unisoc T606 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 256GB వరకు స్టోరేజీని పొడిగించుకొనేందుకు అవకాశం ఉంది.

Lava Bold N1 series smartphone

ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తోపాటు రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే రిటైల్‌ బాక్స్‌లో 10W ఛార్జర్‌ను అందిస్తుంది. లావా బోల్డ్‌ N1 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లకు ఇంటి వద్దకే సర్వీస్‌ సపోర్టును అందిస్తుంది. లావా అధికారిక వెబ్‌సైట్ ద్వారా సర్వీస్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం సహా సర్వీస్‌ షెడ్యూల్‌ చేయవచ్చు.

లావా బోల్డ్‌ N1 సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు :
లావా బోల్డ్‌ N1 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.5999 గా ఉంది. జూన్‌ 4 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. బోల్డ్‌ N1 ప్రో మోడల్‌ను జూన్‌ 2 వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు. ప్రో మోడల్ ధర రూ.6699 గా ఉంది. ఈ రెండు ఫోన్‌లను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

* లావా షార్క్‌ 5G స్మార్ట్‌ఫోన్ :
గత వారం లావా షార్క్‌ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ప్రారంభ ధర రూ.7999 గా ఉంది. ఈ ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6nm ఆక్టా కోర్‌ Unisoc T765 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS తో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. స్టెల్లర్‌ గోల్డ్, స్టెల్లర్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. 1 సంవత్సరం వరకు వారంటీ, ఇంటి వద్దే సర్వీసింగ్‌ అవకాశం కూడా కల్పిస్తోంది.

FAQs
ఈ సిరీస్‌ కెమెరా వివరాలు ఏంటి?

ఈ సిరీస్‌ ప్రో మోడల్‌ 50MP కెమెరాను కలిగి ఉంది. అదే బేస్‌ వేరియంట్‌ 13MP కెమెరాను కలిగి ఉంది.

ఈ సిరీస్‌ సేల్‌ వివరాలు ఏంటి?

ఈ సిరీస్‌ ఫోన్‌లను జూన్‌ 2, 4 తేదీల నుంచి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

లావా బోల్డ్‌ N1 సిరీస్‌తో ఛార్జర్‌ను అందిస్తుందా?

ఈ సిరీస్‌ ఫోన్‌లు రిటైల్‌లో బాక్స్‌లో 10W ఛార్జర్‌ను పొందుతాయి.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X