Home
Mobile

రూ.7499 ధరకు 5000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే, ఆకట్టుకొనే డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్‌

భారత్‌ మార్కెట్‌ లో లావా నుంచి ఎంట్రీ లెవల్ ధరలో లావా బోల్డ్‌ N2 స్మార్ట్‌ఫోన్‌ (Lava Bold N2 Smartphone) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh బ్యాటరీతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. అమెజాన్‌ ద్వారా ఈ ఫోన్ సేల్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ ఫోన్‌ ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

లావా బోల్డ్ N2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ ఫోన్‌ ఇండస్‌ బ్లాక్, సియాచిన్‌ వైట్ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Lava Bold N2 Smartphone

ప్రాసెసర్, OS వివరాలు :
ఈ లావా స్మార్ట్‌ఫోన్ Unisoc SC9863A ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. 4GB వరకు అదనంగా ర్యామ్‌ ను పొడిగించుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 15 గో వెర్షన్ పైన పనిచేస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్ అనుభూతిని అందిస్తుందని లావా చెబుతోంది.

కెమెరా విభాగం పరంగా లావా బోల్డ్ N2 స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 13MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 5MP లెన్స్‌ ఉంటుంది.

Lava Bold N2 Smartphone

5000mAh బ్యాటరీ :
బ్యాటరీ, ఛార్జింగ్‌ విషయానికి వస్తే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ఉంది. కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

లావా బోల్డ్ N2 స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
లావా స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్ ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంటి వద్దనే ఉచితంగా సర్వీస్‌ చేస్తామని సంస్థ చెబుతోంది.

లావా నుంది గత వారం లావా యువ స్టార్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టాకోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Go ఎడిషన్‌ పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ వెనుక వైపు 13MP కెమెరా, LED ఫ్లాష్‌ లైట్‌ ఉంది. ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.7499 గా ఉంది. మార్చి నెలలో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

Best Mobiles in India

English summary
Lava Bold N2 Smartphone launched with 5000mAh battery in india price, specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X