Home
Mobile

రూ.7499 ధరకే 5000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్‌..!

లావా సంస్థ జనవరిలో లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి వచ్చింది. అనంతరం ఫిబ్రవరిలో లావా యువ స్టార్‌ 3 హ్యాండ్‌సెట్‌ లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్‌ మార్చి నెలలో సేల్ ప్రారంభం కానుంది. గత వారం విడుదల అయిన లావా బోల్డ్‌ N2 స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

లావా బోల్డ్ N2 స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ (Lava Bold N2 Smartphone Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.7499 గా ఉంది. ఇంటి వద్దనే ఉచితంగా సర్వీసింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని లావా హామీ ఇచ్చింది.

Lava bold N2 sale

లావా బోల్డ్ N2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
లావా బోల్డ్ N2 స్మార్ట్‌ఫోన్‌ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్ Unisoc SC9863A ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 4GB ర్యామ్, 64GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. దీంతోపాటు అదనంగా 4GB వరకు ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 15 గో వెర్షన్ పైన పనిచేస్తుంది.

13MP కెమెరా :
లావా బోల్డ్‌ N2 స్మార్ట్‌ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 13MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరా ఉంది. ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉంది.

IP64 రేటింగ్‌ :
కనెక్టివిటీ పరంగా 4G, వైఫై, బ్లూటూత్‌, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ను అమర్చి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఇండస్‌ బ్లాక్, సియాచిన్‌ వైట్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

* లావా యువ స్టార్‌ 3 స్మార్ట్‌ఫోన్ :
ఈనెలలోనే లావా యువ స్టార్‌ 3 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. మార్చి నెలలో సేల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టాకోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Go ఎడిషన్‌ పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా 13MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉంది. దీంతోపాటు వెనుక వైపు LED ఫ్లాష్‌ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava bold N2 smartphone with 50MP camera sale to start from today through amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X