ఈ ‘లావా’ భగ భగ మండేనా..?

Posted By: Prashanth

ఈ ‘లావా’ భగ భగ మండేనా..?

 

మొబైల్ ఫోన్‌ల ఉత్పత్తిదారు ‘లావా’(Lava) ఇప్పటికే పలు వేరియంట్‌లలో ఫోన్లను విడుదల చేసి ఆశాజనకమైన అమ్మకాలు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్రాండ్, ఎంటీవీ ఇండియాతో కలిసి ఉత్తమమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో కూడిన ‘లావా ఏ 16 ఎమ్‌టీవీ’ (Lava A16 MTV) బ్రాండెడ్ మొబైల్‌ను లాంఛ్ చేసింది.

ఫోన్ ప్రధాన ఆకర్షణలు:

* అందమైన స్టైలింగ్, * యానిమేటెడ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్, * 2.6 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్, * 3.2 మెగా పిక్సల్ కెమెరా, * యమహా పోర్టబుల్ ఆడియో సిస్టం, * టైపింగ్‌కు అనువుగా ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్, * హై డెఫినిషన్ సామర్ధ్యం గల ఇయర్ ఫోన్స్, * ముందుగానే లోడ్ చేసిన సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్, * ధర రూ.4,000.

పనితీరు:

పనితీరు విషయంలో ‘లావా ఏ 16 ఎమ్‌టీవీ’ ముందంజలో ఉంటుంది. డిస్‌ప్లే వ్యవస్థ మన్నికైన హై రిసల్యూషన్ ప్రకాశవంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. 3.2 మెగా పిక్సల్ సామర్ధ్యం గల కెమెరా మీరు గడిపిన మధర క్షణాలను రియాల్టీ లుక్‌తో స్పందిస్తుంది. పొందుపరిచిన యమహా పోర్టబుల్ ఆడియో సిస్టం ఉత్తమమైన మల్టీ ఆడియో అనుభూతిని కలిగిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot