లావా నుంచి అద్బుతమైన ఫోన్!

Posted By: Staff

లావా నుంచి అద్బుతమైన ఫోన్!

 

లావా తాజాగా ప్రవేశపెట్టిన డ్యూయల్‌సిమ్ హ్యాండ్‌సెట్ ‘సీ71’, భారత్‌లో లభ్యమయ్యే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. టచ్‌స్ర్కీన్ సౌలభ్యతతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ డ్యూయల్ నెట్ వర్కింగ్ అనుభూతులను ఏకకాలంలో చేరువచేస్తుంది. అమర్చిన 3.2 అంగుళాల WQVGA రిసెస్టివ్ డిస్‌ప్లే ధృడమైన మన్నికతో ఉత్తమ క్వాలిటీ విజువల్స్‌ను విడుదల చేస్తుంది.

వెనుక భాగంలో అమర్చిన 1.3 మెగా పిక్సల్ కెమెరా క్వాలిటీతో కూడిన ఫోటోగ్రఫీని చేరువచేస్తుంది. పొందుపరిచిన ఎఫ్ఎమ్ రేడియో అప్లికేషన్ వినోదభరిత వాతావరణాన్ని నెలకొల్పుతుంది. నిక్షిప్తం చేసిన ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్‌లు హైక్వాలిటీతో కూడిన వినోదాలను చేరువచేస్తాయి. 2జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ ఎడ్జ్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టర్‌లను కలిగి ఉంటుంది.

ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. ప్రాసెసర్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. గుగూల్ టాక్, ఫేస్‌బుక్, చాట్ ఆన్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్‌వర్కింగ్ అంశాలను హ్యాండ్‍‌సెట్‌లో ముందుగానే ఇన్స్‌టాల్ చేశారు. అంతేకాకుండా, యాంగ్రీ బర్డ్,

లావా బుడ్డీ, టాకింగ్ క్యాట్ వంటి అప్లికేషన్‌లను డివైజ్‌లో ప్రీలోడ్ చేశారు. అమర్చిన 1150mAh లియోన్ బ్యాటరీ సుదీర్ఘ బ్యాకప్ నిస్తుంది. ఇండియన్ మార్కెట్ల లావా సీ71 డ్యూయల్ సిమ్ ఫోన్ ధర రూ.2,600.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting