విపణిలోకి లావా ఐరిస్ 405+
దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా ‘ఐరిస్ 405+' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,999. శుక్రవారం నుంచి ఈ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతోంది. 4 అంగుళాల తాకే తెరను కలగి ఉన్న ఈ ఫోన్ పరిమాణం 125x64x9మిల్లీమీటర్లు, బరువు 127 గ్రాములు. ఐరిస్ 405+ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్, 232 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్ (ఎంటీకే6572),
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్‌తో, 720పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత,
బ్లూటూత్ విత్ ఏ2డీపీ, వై-ఫై 802.11, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, ఎజీపీఎస్, 3జీ (హెచ్ఎస్ పీఏ+ కనెక్టువిటీ),
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల టాక్‌టైమ్, 657 గంటల స్టాండ్‌బై టైమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








