మార్కెట్లో లావా కొత్త స్మార్ట్‌ఫోన్, ఫాబ్లెట్

Posted By:

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్ వెండర్ లావా మొబైల్స్ ఐరిస్ 454, ఐరిస్ 502 మోడళ్లలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇంకా ఫాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరలు రూ.8,499. రెండు గాడ్జెట్‌లు ఈ వారాంతం లేదా సోమవారం నుంచి ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యంకానున్నాయి.

లావా ఐరిస్ 454 (స్మార్ట్‌ఫోన్)

డ్యూయల్ సిమ్, 4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్, రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్, ఆండ్రాయిడ్ వీ4.0.4 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి రోమ్, 512ఎంబి ర్యామ్, 2జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై హాట్ స్పాట్, 3జీ కనెక్టువిటీ వీడియో కాలింగ్ సపోర్ట్, హెచ్‌డిఎమ్ఐ, జీపీఎస్ సపోర్ట్, బ్లూటూత్, ఆడియో జాక్, బరువు 154.6 గ్రాములు, చుట్టుకొలత 137x70x9.9మిల్లీ మీటర్లు, 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో లావా కొత్త స్మార్ట్‌ఫోన్, ఫాబ్లెట్

లావా ఐరిస్ 502 (ఆండ్రాయిడ్ ఫాబ్లెట్):

డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, వై-ఫై బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot