లావా నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు
ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ లావా.. ‘ఐరిస్ 503', ‘3జీ 402' వేరియంట్‌లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ఐరిస్ 503 ధర రూ.9,999. 3జీ 402 ధర రూ.5,499. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లతో పాటు రిటైలర్ స్టోర్ల వద్ద ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను పొందవచ్చు.

లావా ఐరిస్ 503 స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్540× 960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్. ధర రూ.9,999.
లావా 3జీ 402 కీలక స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480× 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్. ధర రూ. 5,499.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








