లావా ఐరిస్ 503ఇ@రూ.6,749

Posted By:

ఇండియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా(Lava) బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో ఐరిస్ 503ఇ (Iris 503e) పేరుతో సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధర రూ.6,749. ప్రముఖ రిటైలింగ్ చెయిన్ ఇబే.ఇన్ (eBay.in)  వద్ద ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఔత్సాహికులు ఈ స్మార్ట్ డివైస్‌ను బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో సొంతం చేసుకోవచ్చు. ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే....

లావా ఐరిస్ 503ఇ@రూ.6,749

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4 జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, జీపీఎస్ సపోర్ట్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot